‘రాజుగారి గది 2’ లోకి ఇంకెవరెవరు...?

Tuesday,July 09,2019 - 11:02 by Z_CLU

‘రాజుగారి గది 2’ లో ఫస్ట్ ఆప్షన్ గా ఫిక్స్ అయింది తమన్నా. కానీ సినిమా అనౌన్స్ అయిన కొన్ని రోజులుగా అఫీషియల్ గా సినిమా నుండి తప్పుకుంది. అంతలో ఆ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ పేరు చేరింది… ఇప్పటి వరకు కాజల్ ని మరీ హారర్ ఓరియంటెడ్ సినిమాల్లో పెద్ద చూడకపోయినా కొత్తగా ఉంటుందని ఫిక్సయ్యారంతా.. కానీ ఆ టాక్ ఎంతోకాలం నిలవలేదు. కాజల్ అగర్వాల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అనుకునే టైమ్ లో తాప్సీ తో డిస్కర్షన్ నడుస్తున్నాయని వినిపించింది.

మరీ తాప్సీ ఫిక్సయిందా..? రేపో మాపో కన్ఫర్మేషన్ వస్తుందని ఎదురు చూసేలోపు.. కొత్తగా ఈ ప్లేస్ లో అవికాగోర్ పేరు వచ్చి చేరింది… ఒక్క రోల్ కి ఇంత మంది హీరోయిన్సా..? చాన్స్ లేదు కానీ.. సోషల్ మీడియాలో ఈ రోల్ ఎవరు చేస్తే బావుంటుందని జరుగుతున్న డిస్కర్షన్స్ ఒక్కొక్కరిగా ఈ పేర్లు బయటికి వస్తున్నాయి. ఈ వరసన చూస్తే ఈ సినిమాకి మరింత మంది హీరోయిన్స్ క్వాలిఫై అవుతారు.

తమన్నా తరవాత హారర్ సినిమాలకు అంతే గ్లామర్ అద్దగలిగే హీరోయిన్ నందితా శ్వేత. కాకపోతే మేకర్స్ మరీ రొటీన్ అయిపోతుందేమో అనుకుని కన్సిడర్ చేయకపోతే చెప్పలేం కానీ. రూల్ ప్రకారం ఇలాంటి సబ్జెక్ట్ కి తమన్నా తరవాత సూటయ్యేది నందితానే..

తమన్నా తప్పుకోగానే సినిమాని సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచన పక్కన పెట్టి, ప్రస్తుతం హీరోయిన్ ని ఫిక్స్ చేసుకునే  పనిలో పడిన దర్శకుడు ఓంకార్.. చివరికి ఎవరిని ఫిక్స్ చేసుకుంటాడో చూడాలి.