'ఆర్ ఆర్ ఆర్' తర్వాత చరణ్ ఎవరితో ?

Wednesday,March 04,2020 - 06:23 by Z_CLU

ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ లో తారక్ తో కలిసి బిజీగా ఉన్నాడు రామ్ చరణ్. దాదాపు ఇంకో మూడు , నాలుగు నెలల వరకూ షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తర్వాత చరణ్ ఏ దర్శకుడితో చేస్తాడనేది హాట్ టాపిక్ అవుతుంది. అవును ఇంత వరకూ తన నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ బయట పెట్టకుండా క్యురియాసిటీ పెంచేస్తున్నాడు  మెగా పవర్ స్టార్.

ఓ వైపు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ పూర్తి కాకుండానే యంగ్ టైగర్ త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమాను లాక్ చేసుకొని అనౌన్స్ కూడా చేసేశాడు. ఇక మిగిలింది చరణ్ సినిమా అనౌన్స్ మెంటే. ఇప్పటికే చరణ్ లిస్టులో సురేందర్ రెడ్డి, కొరటాల శివ పేర్లు వినిపిస్తున్నాయి. దాదాపు రెండేళ్ళ పాటు ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం డేట్స్ కేటాయించిన చరణ్ తన నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చేదెప్పుడో చూడాలి.