చిరు నెక్స్ట్ డైరెక్టర్స్ వీళ్ళే !

Sunday,October 20,2019 - 12:09 by Z_CLU

150 వ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఒక్కో స్టార్ దర్శకుడితో ఒక్కో సినిమాను ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. లేటెస్ట్ గా తన డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా’ తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్న చిరు నెక్స్ట్ 152 కొరటాల శివతో ఓ కమర్షియల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

కొరటాల సినిమా తర్వాత మళ్ళీ చిరు సొంత బ్యానర్ లో ఓ రీమేక్ సినిమా చేస్తాడని అంటున్నారు. మళయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లూసిఫర్’ ను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దమవుతున్నాడట మెగాస్టార్. ఈ సినిమాను సుకుమార్ డైరెక్ట్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత చిరు పూరికి ఓ అవకాశం ఇవ్వనున్నాడనే టాక్ కూడా గట్టిగా వినబడుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ తో మళ్ళీ ఫాంలోకి వచ్చేసిన పూరి చిరు కోసం కథను సిద్దం చేసే పనిలో ఉన్నాడట.

ఈ లెక్కన చూస్తే 153వ సినిమాను సుకుమార్ తో,  154వ సినిమాను పూరి తో చేసి ఇక  155వ సినిమాను త్రివిక్రమ్ చేతిలో పెట్టి ఆ తర్వాతే మిగతా దర్శకుల గురించి ఆలోచిస్తారని తెలుస్తోంది.