వెంకీ 75... అదేనా ?

Sunday,December 15,2019 - 12:01 by Z_CLU

ప్రస్తుతం ‘వెంకీ మామ’ సినిమాతో థియేటర్స్ లో సందడి చేస్తున్న విక్టరీ వెంకటేష్ నెక్స్ట్ ‘అసురన్’ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జనవరి నుండి సెట్స్ పైకి రానుంది.

అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళకుండానే వెంకీ 75 ఎవరితో అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వెంకీ ల్యాండ్ మార్క్ సినిమా కావడంతో ఆ సినిమా ఎవరితో ఉంటుందా అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో నెలకొంటుంది. తాజా సమాచారం ప్రకారం వెంకీ తరుణ్ భాస్కర్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. దానికంటే ముందు అనిల్ రావిపూడి వెంకీ ‘F3’ సినిమా చేస్తాడనే టాక్ కూడా వినబడుతుంది. సరిలేరు నీకెవ్వరు తర్వాత అనిల్ ‘F2’సీక్వెల్ నే చేస్తాడని అంటున్నారు. దీని బట్టి చూస్తే వెంకీ 75వ సినిమా ‘F3’అయ్యే ఛాన్స్ ఉంది.