'పవన్ 29' ఎవరితో ?

Thursday,March 05,2020 - 03:11 by Z_CLU

ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెట్టి వరుసగా ప్రాజెక్ట్స్ సెట్ చేసుకుంటున్నాడు పవన్. ఓ వైపు ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. క్రిష్ తో చేస్తున్న సినిమా పూర్తవ్వగానే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తాడు పవర్ స్టార్. ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది.

అయితే ఇక్కడి వరకూ లిస్టు బాగానే ఉంది. కానీ హరీష్ శంకర్ తర్వాత అంటే పవర్ స్టార్ 29వ సినిమా ఎవరితో అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకూ ‘పవన్ 29’ సినిమాకు పూరి పేరు వినిపించగా ఇప్పుడు డాలీ పేరు తెరపైకొచ్చింది. పవన్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేసాడు డాలీ. ముచ్చటగా మూడో సారి ఈ కాంబోలో సినిమా రాబోతుందని అంటున్నారు. మరి హరీష్ శంకర్ సినిమా తర్వాత పవన్ ఇద్దరిలో ఎవరితో ముందుగా సినిమా చేస్తాడో చూడాలి.