'జెర్సీ'లో హీరోయిన్ ఎవరు?

Friday,June 22,2018 - 01:12 by Z_CLU

నాని హీరోగా గౌతమ్ డైరక్షన్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ ఓ సినిమా ఎనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. సినిమా ఎనౌన్స్ మెంట్ రోజునే ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించబోతున్నట్టు రూమర్స్ వచ్చాయి. అయితే డైరక్టర్ తో పాటు శృతిహాసన్ కూడా ఈ మేటర్ లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. లేటెస్ట్ గా ఇప్పుడు మరో హీరోయిన్ పేరు తెరపైకొచ్చింది

జెర్సీ సినిమాలో కీర్తిసురేష్ ను హీరోయిన్ గా ట్రై చేస్తున్నారట. నాని-కీర్తి కలిసి ఇప్పటికే నేను లోకల్ సినిమాలో నటించారు. అది పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ను జెర్సీతో మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం డిస్కషన్స్ జరుగుతున్నాయట.

రీసెంట్ గా హారిక-హాసిని బ్యానర్ పై అజ్ఞాతవాసి సినిమా చేసింది కీర్తిసురేష్. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ కూడా ఆ నిర్మాతలదే. సో.. సంప్రదించడం ఈజీనే. పైగా నాని అంటే కీర్తిసురేష్ నో చెప్పే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఆమెకు మహానటి ఛాన్స్ రావడానికి కారణం నాని.

ఈ ఈక్వేషన్స్ అన్నీ చూసుకుంటే జెర్సీలో కీర్తిసురేష్ నటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. 1990ల నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో కీర్తి అయితే బాగుంటుందని డైరక్టర్ గట్టిగా ఫీలవుతున్నాడు. త్వరలోనే ఈ మేటర్ పై ఓ క్లారిటీ రానుంది.