#Venky75 దర్శకుడెవరు?

Tuesday,September 15,2020 - 12:50 by Z_CLU

హీరోల ల్యాండ్ మార్క్ సినిమాలపై ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు Victory Venkatesh ఫ్యాన్స్ కూడా అలాగే ఎదురుచూస్తున్నారు. ‘Naarappa’ తో 74 సినిమాల మార్క్ క్రాస్ చేసి 75వ సినిమాకు చేరుకుంటున్నాడు వెంకీ. అయితే ఇప్పుడు Venky75 ఏ డైరెక్టర్ తో ఉంటుందా అనేది ఫ్యాన్స్ లో క్యూరియాసిటీ రెయిజ్ చేస్తుంది. అవును వెంకీ లిస్టులో ప్రస్తుతం ఓ ముగ్గురు దర్శకులున్నారు. అందులో త్రివిక్రమ్ , అనిల్ రావిపూడి , తరుణ్ భాస్కర్ ఉన్నారు.

అయితే వీరిలో వెంకీ నెక్స్ట్ లిస్టులో ముఖ్యంగా Anil Ravipudi , Tharun Bhaskar పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. అవును తరుణ్ భాస్కర్ తో వెంకటేష్ సినిమా చేయనున్నాడని ఎప్పుడో ప్రకటించాడు సురేష్ బాబు. వెంకటేష్ కోసం తరుణ్ హార్స్ రేసింగ్ నేపథ్యంలో కథ కూడా సిద్దం చేసుకున్నాడు.

ఇక అనిల్ రావిపూడి కూడా విక్టరీ కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ కథను సిద్దం చేసాడని సమాచారం. మరి వీరిద్దరిలో వెంకీ 75 ఎవరు డైరెక్ట్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ విషయంపై క్లారిటీ రావాలంటే వెంకీ నెక్స్ట్ సినిమా ఇదే అంటూ సురేష్ ప్రొడక్షన్ నుండి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాలి. అప్పటి వరకు వెంకీ నెక్స్ట్ డైరెక్టర్ ఎవరనేది చెప్పలేం.