మోక్షజ్ఞ ఎంట్రీ... దర్శకుడెవరు?

Saturday,June 13,2020 - 12:47 by Z_CLU

60వ పుట్టినరోజు జరుపుకున్న బాలయ్య మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ప్రతి  ఇంటర్వ్యూలో మోక్షజ్ఞ ఎంట్రీ పై బాలయ్యకి ప్రశ్న ఎదురైంది. ఓ ఇంటర్వ్యూలో మాత్రం బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ పై స్పందించాడు. మోక్షజ్ఞ మొదటి సినిమా ఎవరితో ఉంటుంది ..? పూరి జగన్నాథ్ పేరు కూడా వినబడుతుంది అనే ప్రశ్నకి సమాధానం ఇచ్చాడు బాలయ్య.

పూరి నా ..? అలాంటిదేం లేదు. బ్రహ్మాండమైన కథలు తీసి పెట్టాను. వాడి సినిమా భారీ గా ఉంటుంది అని హింట్ ఇచ్చాడు బాలకృష్ణ.

దీంతో మోక్షజ్ఞ ఎంట్రీపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది. మొన్నటి వరకు మోక్షజ్ఞ ఎంట్రీ సినిమా గురించి మరిచిపోయిన అభిమానులు ప్రస్తుతం బాలయ్య చెప్పిన మాటలతో నటసింహం తనయుడి సినిమా ఎలా ఉండబోతుంది ? ఎవరు డైరెక్ట్ చేస్తారు ? అనే డిస్కషన్ మొదలుపెట్టారు.

ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం 2-3 కథలు సిద్దం చేసిన బాలయ్య మొదటి సినిమాను ఎవరి చేతిలో పెడతాడనేది ఆసక్తిగా మారింది. మరి నందమూరి యంగ్ హీరోను లాంచ్ చేసే దర్శకుడెవరో చూడాలి.  అయితే డైరక్టర్ ఎవరైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేది రెండేళ్ల తర్వాతే.