శ్రియ ఎత్తుకున్న చంటి పిల్లాడు ఎవరు?

Sunday,September 04,2016 - 03:36 by Z_CLU

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోల సరసన హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ శ్రియ,  ప్రస్తుతం అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. ఇక ఇటీవలే ఈ భామ ఓ చంటి పిల్లాడ్ని ఎత్తుకున్ను ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ ఫోటో చూసిన అందరిలోనూ ఈ చంటి పిల్లాడు ఎవరా? అనే ఆసక్తి మొదలైంది. దీనికి తోడు శ్రియ గెటప్ కూడా రాజుల కాలంనాటి లుక్ తో ఉండడంతో క్యూరియాసిటీ డబుల్ అయింది.

ఇక విషయంలోకి వెళ్తే… ఈ భామ ప్రస్తుతం ఓ ప్రతిష్టాత్మక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఇంకేదో కాదు… నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రంలో బాలయ్య సరసన ఓ గృహిణి పాత్రలో నటిస్తోంది శ్రియ. కథ ప్రకారం సినిమాలో బాలయ్య-శ్రియ దంపతులకు ఓ అబ్బాయి కూడా ఉంటాడు. ఆ పిల్లాడిని ఎత్తుకొని షూటింగ్ చేస్తున్న టైమ్ లో తీసిందే ఈ ఫొటో.