Shakuntalam - ఇంతకీ దుష్యంతుడు ఎవరు?

Thursday,January 07,2021 - 04:15 by Z_CLU

దర్శకుడు గుణశేఖర్ మరో భారీ ప్రాజెక్టును భుజానికెత్తుకున్నాడు. పురాణాలకు చెందిన శకుంతల
ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్టుకు శాకుంతలం (Shakuntalam) అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ ఎపిక్ ప్రాజెక్టులో శకుంతల పాత్రలో నటించడానికి సమంత (Samantha) ఒప్పుకోవడం గుణశేఖర్ కు మంచి బూస్టప్ ఇచ్చింది. సమంత రాకతో ఈ ప్రాజెక్టుకు వెయిట్ పెరిగింది. అయితే సమంతకు జోడీగా నటించడానికి గుణశేఖర్ కు హీరో దొరకడం లేదు. దీనికి ఓ కారణం ఉంది.

samantha-shaakuntalam-శాకుంతలం-సమంత

శాకుంతలం సినిమాలో కథ మొత్తం సమంత చుట్టూనే తిరుగుతుంది. పురాణాల్లో కూడా అలానే ఉంది. దీన్ని మార్చడానికి లేదు. సో.. ఇలాంటి కథలో శకుంతల సరసన దుష్యంతుడి పాత్రలో నటించడానికి స్టార్ హీరోలెవ్వరూ ముందుకు రారు. పైగా ఇది మైథలాజికల్ క్యారెక్టర్ కావడంతో గుణశేఖర్ కు హీరో దొరకడం కష్టంగా మారింది.

ఇంతకుముందు సమంత చేసిన ఓ బేబీ సినిమాకు కూడా ఇదే సమస్య ఎదురైంది. అది కూడా హీరోయిన్ సెంట్రిక్ మూవీ. ఎలాగోలా ఒప్పించి అందులో నాగశౌర్యను హీరోగా తీసుకోగలిగారు. కానీ ఈసారి సమంతకు హీరో దొరకడం కాస్త కష్టమే అంటున్నారు సినీ జనాలు.

సమంత లేటెస్ట్ స్టిల్స్

అందుకే గుణశేఖర్ ఇప్పుడు పాన్-ఇండియా లెవెల్లో ఆలోచిస్తున్నాడు. టాలీవుడ్ నుంచి కాకుండా.. కోలీవుడ్ లేదా బాలీవుడ్ నుంచి ఓ నటుడ్ని దుష్యంతుడి పాత్ర కోసం తీసుకోవాలని అనుకుంటున్నాడు.

మరోవైపు ఈ సినిమా సెట్ వర్క్ పనులు జోరుగా సాగుతున్నాయి.

samantha-shaakuntalam-movie-set-1 samantha-shaakuntalam-movie-set-1