క్యాథరీన్ కొంప ముంచింది ఎవరు..?

Friday,October 14,2016 - 04:29 by Z_CLU

చిరంజీవి రీఎంట్రీ మూవీ ఖైదీ నంబర్ – 150 అనే సినిమాకు ఇంకా పేరు కూడా పెట్టకముందే క్యాథరీన్ ఫైనల్ అయింది. ఓ ఐటెంసాంగ్ కోసం ఆమెను తీసుకున్నారనే విషయం కూడా అందరికీ తెలుసు. తీరా ఐటెంసాంగ్ షూటింగ్ దగ్గరకొచ్చేసరికి, ప్రాక్టీస్ కూడా పూర్తయ్యేసరికి… ఉన్నట్టుండి సడెన్ గా క్యాథరీన్ ను తప్పించేశారు. ఆ స్థానంలో లక్ష్మీరాయ్ ను తీసుకున్నారు. ఇన్నాళ్లూ చిరు సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెగ ఆనందపడిన క్యాథరీన్ కు… సెట్స్ పైకి వచ్చిన తొలిరోజే ఆ ఆనందం ఆవిరైంది. ఇంతకీ ఏం జరిగింది.

14611133_10154698477374363_5251388673070528053_n-1

చిరు సినిమాలో ఐటెంసాంగ్ కు లారెన్స్ కొరియోగ్రాఫీ చేస్తున్నాడు. లారెన్స్-లక్ష్మీరాయ్ కు చాలా మంది సంబంధాలున్నాయి. లారెన్స్ డైరక్ట్ చేసే దాదాపు ప్రతి సినిమాలో లక్ష్మీరాయ్ ఉంటుంది. అందుకే చిరంజీవి 150వ సినిమాలో కూడా లక్ష్మీరాయ్ నే తీసుకోవాలని అనుకున్నాడట లారెన్స్. మరి లక్ష్మీరాయ్, లారెన్స్ ను రిక్వెస్ట్ చేసిందా లేక లారెన్సే పట్టుబట్టి లక్ష్మీరాయ్ ను తీసుకున్నాడో తెలీదు కానీ… క్యాథరీన్ పై మాత్రం వేటు పడింది.

laxmi-raai-catherine
మరోవైపు యూనిట్ తో ఓ సీనియర్ టెక్నికల్ పర్సన్ తో గొడవ పడడం వల్లనే క్యాథరీన్ కు ఆఖరి నిమిషంలో అవకాశం చేజారిపోయిందని మరికొందరు అంటున్నారు. ఇక సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్న చిరంజీవి కూతురు, క్యాథరీన్ కు ప్రొఫెషనల్ గా అభిప్రాయబేధాలు రావడం వల్లనే ఆమెను తప్పించారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్ని వాదనలు వినిపించినా.. 150వ సినిమా నుంచి క్యాథరీన్ ను తొలిగించారనేది మాత్రం వాస్తవం.