ఈసారి సంక్రాంతి ముద్దుగుమ్మ ఎవరు?

Tuesday,December 31,2019 - 09:01 by Z_CLU

పూజా హెగ్డే… రష్మిక… మెహ్రీన్ కౌర్.. నయనతార… ఈ నలుగురిలో టాప్ ప్లేస్ లో నిలబడే ముద్దుగుమ్మ ఎవరు…? ఈ సంక్రాంతికి హీరోల మధ్యే కాదు.. హీరోయిన్స్ మధ్య కూడా గట్టి పోటీ ఉంది. వరస భారీ సినిమాలతో తమ రేంజ్ పెంచుకున్న ఈ హీరోయిన్స్ లో సంక్రాంతికి తగ్గ ముద్దుగుమ్మ అనిపించుకునేది ఎవరో చూడాలి…

 

పూజా హెగ్డే : ‘అల…వైకుంఠపురం’ హీరోయిన్. ఇప్పటికే సాంగ్స్ అన్నీ హిట్. సినిమానుండి ఇప్పటికే రివీల్ అయిన  విజువల్స్ లో పూజా హెగ్డే క్యారెక్టర్ కి కావాల్సినంత స్కోప్ ఉందనిపిస్తుంది. అంతెందుకు… ‘సామజవరగమనా…’, ‘బుట్టబొమ్మ…’ సాంగ్స్ కూడా అక్షరాలా పూజా చుట్టూ తిరిగే పాటలే… అందుకే బన్ని కోసం ఫ్యాస్స్ లో ఎంత ఆరాటముందో.. పూజ కోసం అంతే ప్రేమగా వెయిట్ చేస్స్తున్నారు ఆడియెన్స్.

రష్మిక : మహేష్ బాబుతో ఫస్ట్ టైమ్… అందునా మొన్నటికీ మొన్న ‘హీ ఈజ్ సో క్యూట్..’ అంటూ చిన్న వీడియోలో కనిపించి అంచనాల మీద అంచనాలు క్రియేట్ చేసింది. ఇక ఫుల్ ఫ్లెజ్డ్ సినిమాలో ఏ స్థాయి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.

మెహ్రీన్ : ‘F2’ తో ఆల్రెడీ 2019 లో సంక్రాంతి ముద్దుగుమ్మ అనిపించుకుంది. మరి అదే అదృష్టం ఈ ఏడాది కూడా కలిసొస్తుందా…? అచ్చమైన కుటుంబ కథా చిత్రంలో కనిపించనున్న మెహ్రీన్.. ఈసారి కూడా అదే స్థాయిలో మెస్మరైజ్ చేస్తుందా…?

నయనతార : తలైవా రజినీకాంత్ సరసన కనిపించనుంది. స్ట్రేట్ తెలుగు సినిమా కాకపోయినా, సూపర్ స్టార్ రజినీకాంత్ కాబట్టి ఈ సినిమా కూడా సంక్రాతి బరిలో స్ట్రాంగ్ గానే దిగుతుంది. ఇక ఆల్రెడీ లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్న నయన్… సంక్రాంతి ముద్దుగుమ్మ రేస్ లో ఏ ప్లేస్ లో నిలబడుతుందో చూడాలి.