NTR… మహేష్ బాబు... ఇంతకీ ఎవరితో ముందు...?

Thursday,September 12,2019 - 01:41 by Z_CLU

KGF సక్సెస్ తో ఈ సినిమా దర్శకుడు జస్ట్ ఆడియెన్స్ దృష్టిలోనే కాదు. స్టార్ హీరోల దృష్టిలో కూడా పడ్డాడు. ప్రశాంత్ నీల్ కథ రెడీగా ఉందని చెప్పాలే కానీ, ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కన్సిడర్ చేసేస్తాడు. NTR తో సినిమా అవకాశం కూడా ఈ దర్శకుడికి అలాగే దొరికింది. అయితే రీసెంట్ గా నీల్ ప్రశాంత్ మహేష్ బాబును కూడా కలిశాడట. దాంతో సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ బిగిన్ అయ్యాయి.

మొన్నటి వరకు ‘RRR’ తరవాత NTR సెట్స్ పైకి రాబోయేది ఈ సినిమాతోనే అని ఫిక్సయి ఉన్నారు ఫ్యాన్స్. ఇంతలో పిక్చర్ లోకి మహేష్ బాబు వచ్చేసరికి… ఇంతకీ ఈ దర్శకుడు NTR తో సినిమా చేశాక మహేష్ బాబుతో చేస్తాడా..? లేకపోతే మహేష్ బాబు తరవాతే NTR తో సినిమా చేస్తాడా…? అనే పజిల్ లో పడ్డారు ఫ్యాన్స్.

నిజానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలకు కథ చెప్పాడు కాబట్టి ఈ టాపిక్ చుట్టూ ఇంత హీట్ జెనెరేట్ అవుతుంది కానీ, అటు మహేష్ బాబు, ఇటు NTR తో పాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా KGF చాప్టర్ 2 తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరవాతే ఈ ఇద్దరు స్టార్ హీరోల్లో ఎవరు ముందు పిలిచి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో.. దాన్ని బట్టే ఈ డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఉంటుంది…