అనూ ఇమ్మాన్యువెల్ - తప్పెక్కడ జరిగింది..?

Monday,March 04,2019 - 12:01 by Z_CLU

కరియర్ బిగినింగ్ లోనే బడా స్టార్స్ సరసన చాన్స్ కొట్టేసింది అనూ ఇమ్మాన్యువెల్. ఫ్లైట్ దిగీ దిగగానే స్టార్ హీరోల  దృష్టిలో పడిపోయిందీ NRI అన్నారంతా. కానీ అది ఎంతో కాలం నిలవనే లేదు. అవకాశాలు వచ్చాయి సరే, కానీ క్రేజ్ ఏదీ…? స్టార్ హీరోల సరసన కనిపించింది సరే, ఏ మాత్రం ఫ్యాన్స్ తో కనెక్ట్ అవ్వగలిగింది..?  అసలు అనూ ఇమ్మాన్యువెల్ విషయంలో తప్పెక్కడ జరిగింది..?

 

మజ్ను : కరెక్ట్ చాయిస్. నాని సినిమాతో లాంచ్ అవ్వాలే కానీ స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ అనే టాక్ ఉంది ఇండస్ట్రీలో. ఈ సినిమాలో ఇంకో హీరోయిన్ ఉన్నా, మార్కులు మాత్రం అనూ కే పడ్డాయి. ఇనాళ్ళు ఎక్కడ ఉండిపోయిందనిపించింది. పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం కానీ, ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. ఏముంది ఈజీగా ఆడియెన్స్ కి కనెక్ట్ అయిపొయింది.

కిట్టు ఉన్నాడు జాగ్రత్త : ఈ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయిందా అంటే ఊ కొట్టలేం కానీ, యూత్ కైతే మరింత దగ్గరయింది. సినిమాలో రాజ్ తరుణ్ కి ఎంత స్కోప్ ఉందొ, అనూ కి అంతే స్పేస్ దొరికింది కాబట్టి ‘మజ్ను’ సినిమా మిస్సయిన వాళ్లకు కూడా ఈ సినిమాతో పరిచయమై పోయింది అనూ ఇమ్మాన్యువెల్.

ఆక్సిజన్ : ఎక్స్ పెక్ట్ చేసిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు, దీంతో ఆల్మోస్ట్ అనూ పని కూడా అయిపోయిందనుకున్నారంతా. కానీ అలా జరగలేదు.మూడో సినిమా సక్సెస్ అవ్వకపోవడం అనూని రెడ్ జోన్ లోకి నెట్టేసింది.

 

అజ్ఞాతవాసి : జస్ట్ 3 సినిమాల అనుభవం. ఇంకా గట్టి హిట్ కూడా పడలేదు… అప్పుడే పవన్ కళ్యాణ్ హీరోయిన్ అనిపించుకుంది. సినిమా ఎంతగా సక్సెస్ అయింది అనేది పక్కన పెడితే అనూ క్యారెక్టర్ కూడా పెద్దగా ఎవరికీ కనెక్ట్ అవ్వలేదు. ఇక ఈ సినిమా  చూసిన తరవాత అమ్మడు పర్ఫామెన్స్ కైనా రేటింగ్ ఇద్దామనేంత ఎఫర్ట్స్ కూడా ఎవరూ పెట్టకపోవడంతో, ఫోకస్ లోకి రాలేకపోయింది.

నా పేరు సూర్య : బన్ని ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం డెఫ్ఫినెట్ గా చాలా స్పెషల్. ఇక జస్ట్ అనూ గురించే మాట్లాడాలంటే ఈ సినిమాలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ మరీ… కమర్షియల్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి అనూకి ఈ సినిమాలో 100% అవకాశం దొరికింది. కాస్ట్యూమ్స్ దగ్గరి నుండి సాంగ్స్ వరకు, అనూ స్టాండర్డ్స్ ని సెట్ చేసింది ఈ సినిమా. అనూ పర్ఫామెన్స్ కి కూడా ఈ సినిమాలో మంచి అప్లాజ్ వచ్చింది.

శైలజా రెడ్డి అల్లుడు :  నా పేరు సూర్య తో కమర్షియల్ హీరోయిన్ అనిపించుకుంటే, ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది. ఈగోయిస్టిక్ రోల్ లో ఆదరగొట్టింది అనిపించుకుంది. కానీ కథ మాత్రం మళ్ళీ మొదటికే వచ్చింది.

అనూ ఇమ్మాన్యువెల్ కరియర్ గమనిస్తే అనూ నటించిన సినిమా ఫ్లాప్ అయినా ఆ ఇంపాక్ట్ తనపై పడలేదు. ఆ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా స్టార్ హీరోల సరసన చాన్స్ కొట్టేసింది. కానీ సినిమా సక్సెస్ కూడా తన కరియర్ పై ఇంపాక్ట్ చూపకపోవడం కొంచెం ఫీలవాల్సిన విషయమే.
వరస ఆఫర్లు అందుకున్నా ఫ్యాన్స్ లో క్రేజ్ క్రియేట్ చేసుకోలేకపోవడం అనేది డెఫ్ఫినెట్ గా డిఫెక్టే.  టాప్  మోస్ట్ స్టార్స్ తో నటించాక కూడా ఇంకా బెస్ట్ అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్న హీరోయిన్స్ లిస్టు లోనే ఉండిపోవడం చూస్తే, అనూ ఎక్కడో తనను తాను  ప్రమోట్ చేసుకోవడంలో విఫలమయిందనే అనిపిస్తుంది. తప్పక్కడ జరిగిందో తెలుసుకుని ప్లాన్డ్ గా ఉంటే సరి.