#Venky75 - ఎనౌన్స్ మెంట్ ఉంటుందా!

Monday,November 23,2020 - 11:57 by Z_CLU

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తన 74వ సినిమా చేస్తున్నాడు వెంకటేష్. ఫినిషింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమా తర్వాత వెంకీ చేయబోయే సినిమా ప్రకటన కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు దగ్గుబాటి ఫ్యాన్స్. దీనికి కారణం వెంకటేష్ తదుపరి చేయబోయే సినిమా అతడి కెరీర్ లో 75వ సినిమా. విక్టరీ తన ల్యాండ్ మార్క్ సినిమాను ఏ దర్శకుడితో చేస్తాడా అని అప్పుడే అభిమానుల్లో ఆసక్తి నెలకొంటుంది.

వెంకటేష్ కోసం తరుణ్ ఇప్పటికే హార్స్ రైడింగ్ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ డ్రామా కథను కూడా సిద్దం చేశాడు. మొన్నటివరకూ #Venky75 సినిమాను Tharun Bhaskar హ్యాండిల్ చేస్తాడనే ప్రచారం జరిగింది. అయితే ఆ సినిమా కరోనా ఎఫెక్ట్ తో ఇంకా అలస్యం కానుందని తెలుస్తుంది.

ఇక అనీల్ రావిపూడి తో వెంకీ F3 చేస్తాడనే ప్రచారం జరుగుతుంది. మరి అదే విక్టరీ 75 వ సినిమాగా రానుండా అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా సురేష్ ప్రొడక్షన్స్ నుండి వెంకీ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చే వరకూ ఏది నమ్మలేం.