Vakeel Saab ఎనౌన్స్ మెంట్ ఎప్పుడు?

Wednesday,October 28,2020 - 03:01 by Z_CLU

Pawan Kalyan Vakeel Saab రిలీజ్ డేట్ పై ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టి చర్చ నడుస్తుంది. అవును ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు మేకర్స్. పవన్ రీ ఎంట్రీ ఇస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా థియేటర్స్ లోకి ఎప్పుడొస్తుందా అని పవన్ ఫ్యాన్స్ తో పాటు కొందరు దర్శక నిర్మాతలు కూడా ఎదురుచూస్తున్నారు.

కేవలం కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తారనే టాక్ వినబడుతుంది. అయితే ఇప్పటికే సంక్రాంతికి తమ సినిమా రాబోతుందంటూ ఎనౌన్స్ చేసుకున్న నిర్మాతలు ఒకవేళ ‘వకీల్ సాబ్’ సంక్రాంతికి వస్తే వాళ్ళ సినిమాను ఎప్పటికి పోస్ట్ పోన్ చేసుకోవాలా అని అలోచిస్తున్నారు.

ఇక Pawan Kalyan సినిమా ఎప్పుడొస్తుందనేది దీపావళి కి తెలిసిపోనుంది. వచ్చే నెల 14న టీజర్ ను విడుదల చేసి రిలీజ్ ఎప్పుడు అనేది తెలియజేయనున్నారు మేకర్స్. మరి అప్పటి వరకు Vakeel Saab Release డిస్కషన్ ఇలానే కొనసగుతుంది.