Ram Charan - డిసైడ్ అయ్యేదెప్పుడు?

Wednesday,October 28,2020 - 02:28 by Z_CLU

ప్రస్తుతం స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు రెండు మూడు సినిమాలు ఎనౌన్స్ చేసి సెట్స్ పై ఉన్నారు. కానీ మెగా పవర్ స్టార్ RamCharan మాత్రం ఇంతవరకూ తన నెక్స్ట్ సినిమా ఏ దర్శకుడితో ఉంటుంది అనేది ఎనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం NTR తో కలిసి Rajamouli డైరెక్షన్ లో RRR సినిమా చేస్తున్న చరణ్ ఇప్పటికే రెండు మూడు స్క్రిప్ట్స్ లాక్ చేసుకున్నాడు కానీ వాటి డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా జాగ్రత్త వహిస్తున్నాడు.

లాక్ డౌన్ లో తన నెక్స్ట్ సినిమాల దర్శకులతో డిస్కషన్స్ కూడా జరిపాడట చరణ్. నిజానికి చరణ్ నెక్స్ట్ లిస్టులో వంశీ పైడిపల్లి , త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ వంటి దర్శకుల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి కానీ ఇంత వరకు వీటిపై క్లారిటీ కాదు కదా కనీసం హింట్ కూడా రాలేదు. మరి RRR తర్వాత చరణ్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా దాని డీటెయిల్స్ ఎప్పుడు ప్రకటిస్తారా అని మెగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.