అఖిల్ రెండో సినిమా ఎప్పుడో ?

Saturday,August 13,2016 - 03:09 by Z_CLU

యువ కథానాయకుడు అక్కినేని అఖిల్ రెండో సినిమా ను  ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తాడా? అని ఎదురుచూస్తున్నారు అక్కినేని ఫాన్స్. ‘అఖిల్’ చిత్రం తో కథానాయకుడిగా అరంగేట్రం చేసిన ఈ కుర్ర హీరో ఆ సినిమా విడుదలై చాలా నెలలే కావొస్తున్నా తన రెండో సినిమాను ఇంత వరకూ ప్రారంభించకపోవడం తో అఖిల్ రెండో సినిమాను ఎవరు రూపొందిస్తారా? అని ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. ఇటీవలే హను తో సినిమా చేయబోతున్నాను అని ట్వీట్ చేసే సరికి ఇక అఖిల్ రెండో సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది అనుకున్నారంతా కానీ తాజాగా హను నితిన్ తో ఓ సినిమా కమిట్ అయ్యాడని ఆ సినిమా తరువాతే అఖిల్ తో సినిమా చేసే అవకాశం ఉందనే వార్త వినిపిస్తుండడం తో మరి అఖిల్ రెండో సినిమా ఏ దర్శకుడి తో ఉంటుందో? తెలియని పరిస్థితి నెలకొంది. మొదట అఖిల్ రెండో చిత్రం వంశీ పైడి పల్లి తో ఉంటుందని నాగ్ చెప్పారు కానీ వంశీ మహేష్ తో రెడీ అవుతుండడం తో అఖిల్ రెండో సినిమా లిస్ట్ నుండి వంశీ తప్పుకున్నట్లే అని టాక్ వినిపిస్తుంది. మరి అఖిల్ రెండో సినిమా పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో? చూడాలి.