నితిన్ ఆ రీమేక్ చేసేదెప్పుడు ?

Sunday,October 13,2019 - 01:15 by Z_CLU

ప్రస్తుతం నితిన్ చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘భీష్మ’ తో పాటు చంద్ర శేఖర్ ఏలేటి సినిమాను కూడా సెట్స్ పై పెట్టేసిన నితిన్ లేటెస్ట్ గా వెంకీ అట్లూరితో ‘రంగ్ దే’ సినిమాను స్టార్ట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఈ సినిమా తర్వాత నితిన్ కృష్ణ చైతన్య తో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇటివలే ‘అంధదూన్’ రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాడు. శ్రేశ్ట్ మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను చేయాలనుకుంటున్నాడు నితిన్. ఇంకా దర్శకుడి వేటలోనే ఉన్నారు. ఈ రీమేక్ కి పర్ఫెక్ట్ డైరెక్టర్ ఎవరా అనే ఆలోచనలో పడ్డాడు నితిన్. అయితే కృష్ణ చైతన్య సినిమా కంటే ముందే నితిన్ ఈ రీమేక్ సినిమా చేసే చాన్స్ ఉందనే టాక్ వినబడుతుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే.