చరణ్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో ?

Sunday,August 27,2017 - 11:40 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- సుకుమార్ కాంబినేషన్లో మోస్ట్ ఎవైటింగ్ మూవీగా తెరకెక్కుతున్న ‘రంగస్థలం’ సినిమా రిలీజ్ డేట్ పై అందరిలో కన్ఫ్యూజన్ నెలకొంటుంది.. విల్లేజ్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ రోజే తనకిష్టమైన సంక్రాంతి సీజన్ కె ఈ సినిమా థియేటర్స్ లో రానుందని అనౌన్స్ చేశాడు చరణ్. ఆ తర్వాత ఈ సినిమా సంక్రాంతికి రావట్లేదని, జనవరి నుంచి డిసెంబర్ కి షిఫ్ట్ అయిందని వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాపై మరో న్యూస్ టాలీవుడ్ లో హంగామా చేస్తూ అభిమానుల్ని కన్ఫ్యూజన్ లో పడేసింది… ఈ సినిమా డిసెంబర్ నుంచి ఏప్రిల్ కి షిఫ్ట్ అయిందని సమ్మర్ కానుకగా రిలీజ్ కానుందనేది ఈ న్యూస్.. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో ఎన్ని వార్తలొచ్చినా నోరుమెదపడం లేదు మేకర్స్.. కనీసం చరణ్ అయినా రిలీజ్ డేట్ పై కన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుందని వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.. మరి ‘రంగస్థలం’ రిలీజ్ డేట్ పై చరణ్ క్లారిటీ ఇచ్చేదెప్పుడో..?