ఇంతకీ త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేశాడు..?

Tuesday,November 05,2019 - 10:02 by Z_CLU

రీసెంట్ గా ‘అల వైకుంఠపురం’ నుండి రిలీజైన టాబూ ఫస్ట్ లుక్ కి ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ అయింది. ఇన్నేళ్ళయినా  టాబూ గ్లామర్ ఏ మాత్రం చెక్కు చెదరలేదనే పాజిటివిటీ కూడా జెనెరేట్ అయింది. అయితే దీంతో పాటు ఆడియెన్స్ లో ఇంకో కొత్త క్వశ్చన్ రేజ్ అయింది. ఇంతకీ సినిమాలో టాబూ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది..? ఇంతకీ ఈ సీనియర్ హీరోయిన్ కి, హీరోకి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ ని క్రియేట్ చేసుకున్నాడు దర్శకుడు..?

గతంలో సీనియర్ హీరోయిన్ నదియాని హీరోలకి అత్తగా చూపించాడు. ‘అజ్ఞాతవాసి’ లో ఖుష్బూని పవర్ స్టార్ కి పిన్ని గా ప్రెజెంట్ చేసిన చేశాడు. మరి ఈ సారి టాబూ అల్లు అర్జున్ కి అమ్మగా కనిపించనుందా…? లేకపోతే అత్తగా కనిపించనుందా..? ఇవేవీ కాకుండా త్రివిక్రమ్ మరేదైనా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని రాసుకున్నాడా..?

సాధారణంగా రెగ్యులర్ సినిమాల్లో సీనియర్ క్యారెక్టర్స్ చుట్టూ ఈ స్థాయిలో క్యూరియాసిటీ జెనెరేట్ అవ్వదు. కానీ త్రివిక్రమ్ సినిమాలు వేరు. మ్యాగ్జిమం కథ హీరోకి, ఈ సీనియర్ హీరోయిన్స్ కి కనెక్ట్ అయ్యే ఉంటుంది. అందుకే ఈ క్యారెక్టర్ కోసం త్రివిక్రమ్ కూడా పాప్యులర్ సీనియర్ హీరోయిన్స్ ని ప్రిఫర్ చేస్తుంటాడు.

బర్త్ డే సందర్భంగా ‘టాబూ’ లుక్స్ ఎలా ఉండబోతున్నాయన్నది రివీల్ చేశారు కానీ, ఎగ్జాక్ట్ గా ఈ క్యారెక్టర్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఇంకా ప్రస్తుతానికి సస్పెన్సే. చూడాలి మరీ త్రివిక్రమ్ ఏం ప్లాన్ చేస్తున్నాడో…