బన్నీ సినిమాలో యాక్షన్ కింగ్ రోల్ అదే...?

Sunday,September 17,2017 - 01:06 by Z_CLU

వక్కంతం వంశీ డైరెక్షన్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో శరత్ కుమార్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుండగా.. యాక్షన్ కింగ్ అర్జున్ మరో కీ రోల్ లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాలో మీ రోల్ ఎలా వుండబోతుందనే ప్రశ్న కి జవాబు ఇవ్వకుండా వెయిట్ అండ్ సీ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్.

లేటెస్ట్ గా లై సినిమాతో తెలుగులో రి ఎంట్రీ ఇచ్చిన యాక్షన్ కింగ్ ఈ సినిమాలో కూడా మరోసారి నెగటివ్ రోల్ లోనే కనిపించనున్నాడనే వార్త చక్కర్లు కొడుతుంది. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కి అర్జున్ కి డీ అంటే డీ అనే సన్నివేశాలు ఉంటాయని వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని, అల్లు అర్జున్ జవాన్ గా సరి కొత్త లుక్ తో కనిపిస్తూ డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేస్తాడని సమాచారం. మరి ఈ వార్త కనుక విజమైతే సినిమాలో అర్జున్ vs అర్జున్ సన్నివేశాలు ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఖాయం..