లాక్ డౌన్ తర్వాత ఏం చేయబోతోంది?

Friday,May 01,2020 - 12:11 by Z_CLU

లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందా, ఎప్పుడు సెట్స్ పైకి వెళ్దామా అని సినిమా వాళ్లంతా ఎదురుచూస్తుంటారు. పూజా హెగ్డే లాంటి బిజీ హీరోయిన్ అయితే ఈ విషయంలో మరింత ఆత్రుతగా ఉండాలి. చేతిలో ఉన్న సినిమాలు పూర్తిచేయడంతో పాటు వెల్లువలా వస్తున్న ఆఫర్లలో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి.

కానీ పూజా హెగ్డే దృష్టి మాత్రం ఇప్పుడు సినిమాలపై లేదు. లాక్ డౌన్ పూర్తయితే వెంటనే కుదిరితే ఓ మంచి వెకేషన్ కు వెళ్తానంటోంది ఈ బ్యూటీ.

దాదాపు నెల రోజులుగా ఇంట్లో కూర్చొని బోర్ కొట్టిందని, బయట ప్రపంచాన్ని చూడాలనుకుంటున్నానని అంటోంది పూజా హెగ్డే. అందుకే చేతిలో ఉన్న సినిమాల్లో ఏదో ఒకటి పూర్తిచేసి వీలైనంత త్వరగా వెకేషన్ ప్లాన్ చేస్తున్నట్టు తెలిపింది.

ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో ప్రభాస్, అఖిల్ సినిమాలున్నాయి. వీటిలో ప్రభాస్ సినిమా టైమ్ పడుతుంది. అఖిల్ సినిమా తొందరగా పూర్తవుతుంది. సో.. ఈగ్యాప్ లో పూజా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసిందన్నమాట.

అన్నట్టు ఈసారి విదేశాలకు వెళ్లడం లేదు ఈ ముద్దుగుమ్మ. కరోనా వల్ల విదేశాల్లో పరిస్థితులు బాగాలేవు కాబట్టి.. ఇండియాలోనే టూర్ ఫిక్స్ చేసుకుంది. కుదిరితే కేరళలోకి ప్రసిద్ధ బెకల్ బీచ్ కు వెళ్తానని అంటోంది. మణిరత్నం బొంబాయి సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ను ఇక్కడే తీశారు.