రామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ?

Sunday,September 08,2019 - 09:16 by Z_CLU

వరుస ఫ్లాపుల తర్వాత ఓ బ్లాక్ బస్టర్ వస్తే ఏ హీరో అయినా ఏం చేస్తాడు… వెంటనే క్రేజీ ప్రాజెక్ట్స్ తో స్పీడ్ పెంచేస్తాడు. అయితే రామ్ పోతినేని ఇందుకు మినహాయింపు.  స్లో అండ్ స్టడీ అనే సూత్రానికె కట్టుబడి ఉండిపోయాడు. ‘ఇస్మార్ట్ శంకర్’ తో భారీ హిట్ వచ్చింది. ఈ సినిమా తర్వాత వెను వెంటనే సినిమాలు అనౌన్స్ చేసి స్పీడ్
అందుకుంటాడనుకుంటే రామ్ ఇంత వరకూ నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేయలేదు.

నిజానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ కి ముందు తర్వాత కూడా ఇదే పరిస్థితి. ఆ సమయంలో ఒక అభిమాని అయితే “అన్నా సినిమా ఎప్పుడు” అంటూ రామ్ ని భయపెట్టే రీతిలో ఓ పోస్ట్ కూడా చేసాడు. డానికి రామ్ రిప్లై ఇచ్చాడు కూడా. ‘ఇస్మార్ట్ శంకర్’ విడుదలై యాబై రోజులు దాటినా రామ్ నుండి ఇంకా నో అప్డేట్.

మొన్నటి వరకూ ‘తడం’ ను రీమేక్ చేస్తాడని టాక్ వచ్చింది. ఇప్పుడు ఆ సినిమా లేనట్టే అంటున్నారు. రామ్ నుండి ఇంకా దీనిపై క్లారిటీ లేదు. రామ్ గ్యాప్ తీసుకుంటూ ఆచి తూచి అడుగులేస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఓ బ్లాక్ బస్టర్ తర్వాత కూడా రామ్ ఇంత లేట్ చేయడం అభిమానులను నిరాశ పరుస్తుంది. అయితే లేటైనా క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించడం ఎనర్జిటిక్ స్టార్ స్పెషాలిటీ.