లూసిఫర్ రీమేక్ ఇక లేనట్టేనా?

Thursday,July 30,2020 - 04:20 by Z_CLU

లూసిఫర్‘ నుంచి సుజీత్ ను తప్పించారని కొంతమంది అంటున్నారు. ఈ రీమేక్ ను వీవీ వినాయక్ కు అప్పగించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు. అయితే ఈ రెండూ ప్రస్తుతానికి గాసిప్స్ మాత్రమే. నిజం ఏంటంటే.. లూసిఫర్ రీమేక్ పై చిరంజీవి ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

లూసిఫర్ కథను చిరంజీవి ఇమేజ్, స్టయిల్ కు తగ్గట్టు మార్చమని లూసిఫర్ కు బాధ్యతలు అప్పగించిన మాట నిజమే. అతడు ఆ మార్పుచేర్పులు చేశాడు కూడా. అంతవరకు మాత్రమే జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క ఇంచ్ కూడా అప్ డేట్ లేదు. ఇంతలోనే గాసిప్స్ పుట్టుకొచ్చాయి.

నిజానికి అటు చిరంజీవికి, ఇటు నిర్మాత పొజిషన్ లో ఉన్న రామ్ చరణ్ కు లూసిఫర్ పై అస్సలు దృష్టి లేదు. చిరంజీవి మనసంతా ఆచార్య సినిమాపై ఉంది. ఇటు రామ్ చరణ్.. RRR కోసం వెయిటింగ్. ఈ రెండింటిలో ఏదో ఒకటి కొలిక్కి వచ్చేంతవరకు లూసిఫర్ రీమేక్ పై క్లారిటీ రాదు.