ఆ సినిమా సంగతేంటి బన్నీ?

Saturday,August 01,2020 - 01:00 by Z_CLU

కొన్ని సినిమాలు అనౌన్స్ మెంట్ దగ్గరే ఆగిపోతాయి. రోజులు గడుస్తున్నా ముందుకు కదలని అలాంటి ప్రాజెక్ట్స్ టాలీవుడ్ లో చాలానే ఉన్నాయి. వాటిలో బన్నీ ‘ఐకాన్’ ఒకటి. అల్లు అర్జున్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని స్టైలిష్ స్టార్ కి ‘ఐకాన్’ అనే టైటిల్ తో కథను సిద్దం చేసాడు దర్శకుడు వేణు శ్రీరామ్. స్క్రిప్ట్ బన్నీ కి నచ్చడంతో వెంటనే దిల్ రాజు బ్యానర్ లో సినిమా అనౌన్స్ చేసారు. కానీ ఇప్పటి వరకు సినిమా షూటింగ్ పై ఎలాంటి క్లారిటీ రాలేదు.

ప్రస్తుతం బన్నీ సుకుమార్ తో ‘పుష్ప’ చేస్తుండగా వేణు శ్రీరామ్ పవన్ కళ్యాణ్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అవ్వగానే వీరిద్దరి కాంబోలో రానున్న ‘ఐకాన్’ సెట్స్ పైకి వస్తుందని ఊహించారు బన్నీ ఫాన్స్. కానీ నిన్న తన తదుపరి సినిమా #AA21 ను కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్నట్లు అల్లు అర్జున్ ప్రకటించడంతో మరి ‘ఐకాన్’ సంగతేంటి అనే డిస్కర్షన్ ఫాన్స్ లో మొదలైంది.

స్టైలిష్ టైటిల్ పట్టుకొని ఫాన్స్ ఈ ప్రాజెక్ట్ పై ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. మరి అనౌన్స్ మెంట్ వరకు వచ్చిన ఈ సినిమా అసలు సెట్స్ పైకి వెళ్తుందా ? లేదంటే అటకెక్కినట్లేనా ? తెలియాల్సి ఉంది.