వీకెండ్ రిలీజెస్

Wednesday,November 01,2017 - 01:52 by Z_CLU

ఈ వీకెండ్ (03-11-2017) మూడు సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. ఈ మూడు సినిమాలు వేటికవే డిఫరెంట్ జానర్స్ కు చెందిన సినిమాలు కావడం విశేషం. ఆ సినిమాలేంటో చూద్దాం

1. ఏంజెల్

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న సినిమా ఏంజెల్. నాగ్ అన్వేష్, హెబ్బా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమాకు సింధురపువ్వు కృష్ణారెడ్డి, భువన్ సాగర్ నిర్మాతలు. బాహుబలి ఫేం పళని దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథాంశంతో భారీ బడ్జెట్ తో వస్తోంది ఈ సినిమా. సప్తగిరి కామెడీ, గ్రాఫిక్స్ సినిమాకు హైలెట్స్.

2. నెక్ట్స్ నువ్వే

ఏంజెల్ సినిమా సోషియో పాంటసీ కథతో వస్తుంటే.. నెక్ట్స్ నువ్వే సినిమా హారర్ కామెడీ కాన్సెప్ట్ తో వస్తోంది. ఆది, వైభవి, రేష్మి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో ప్రముఖ సీరియల్ ఆర్టిస్టు ప్రభాకర్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. వి-4 మూవీస్ బ్యానర్ పై బన్నీ వాసు, వంశీ, జ్ఞానవేల్, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

3. గరుడ వేగ

కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న సినిమా గరుడవేగ. రాజశేఖర్, పూజా కుమార్ హీరోహీరోయిన్లుగా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకుడు. రాజశేఖర్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ సినిమాగా దాదాపు 25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మితమైన ఈ సినిమాకు కోటీశ్వర రాజు నిర్మాత.  ఓ కీలకపాత్రలో శ్రద్ధాదాస్ నటించగా, సన్నీలియోన్ ఐటెంసాంగ్ చేసింది.