వీకెండ్ రిలీజ్

Wednesday,August 30,2017 - 03:10 by Z_CLU

ప్రతీ వీక్ ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయి. అయితే ఈ వీకెండ్ కూడా ఓ రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ బాలీవుడ్ సినిమా మరో హాలీవుడ్ సినిమా థియేటర్స్ లోకి వస్తున్నాయి.. ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..


ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ థియేటర్స్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది పూరి -బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘పైసా వసూల్’. బాలయ్య డిఫరెంట్ క్యారెక్టర్ తో ఎంటర్టైన్ చేయబోతున్న ఈ సినిమాలో శ్రేయ హీరోయిన్ గా నటించగా ముస్కాన్, కైరా  కీ రోల్స్ లో నటించారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఈ వీకెండ్ లో మోస్ట్ అట్రాక్టివ్ మూవీ లిస్ట్ ఫస్ట్ ప్లేస్ పైసావసూల్ దే.


సెప్టెంబర్ 2న కొత్త వారితో తెరకెక్కిన లవ్ ఎంటర్టైనర్ గా థియేటర్స్ లోకి వస్తుంది ‘వెళ్ళిపోమాకే’. అలీ మహమ్మద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో గా నటించగా ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాను దిల్ రాజు సమర్పిస్తుండడం విశేషం.


ఈ వీకెండ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది బాలీవుడ్ మూవీ ‘బాద్షాహో’.. అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీ, ఇలియానా, ఇషా గుప్తా,సంజయ్ మిశ్ర, శరద్ కేల్కర్ తదితరులతో యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు మిలన్ దర్శకుడు. సన్నీ లియోన్ ఓ ఐటెం సాంగ్ లో కనిపించనుంది.


ఈ వీకెండ్ ‘స్టీవెన్ స్పీల్ బర్గ్’ డైరెక్షన్ లో తెరకెక్కిన ‘క్లోజ్ ఎన్కౌంటర్స్ ఆఫ్ ది థర్డ్ కైండ్’ అనే హాలీవుడ్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. 1977లో వచ్చిన హాలీవుడ్ క్లాసిక్ ఇది. అప్పటి సినిమాకు డిజిటల్ టచ్ ఇస్తూ.. ఆడియో, వీడియో క్వాలిటీ పెంచి 4k ఫార్మాట్ లో (డిజిటల్లీ రీమాస్టర్డ్) మళ్లీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటితరానికి కూడా ఈ సినిమాను చూపించాలనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా ఈ వీకెండ్ థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.