వీకెండ్ రిలీజ్

Wednesday,December 04,2019 - 02:59 by Z_CLU

వరసగా 5 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి ఈ వీకెండ్. వాటిలో దేనికదే డిఫెరెంట్ జోనర్. ఆ డీటేల్స్ ఇవే…

90 ML : కార్తికేయ, నేహ సోలంకి జంటగా నటించిన సినిమా. హీరోకి 3 పూటలా 90 ml కంపల్సరీ గా పడాలి అది అవసరం. ఇక హీరోయిన్ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ ఆల్కహాల్ అన్న పదం కూడా వినిపించకూడదు. ఈ సెగ్మెంట్ తో పాటు ట్రైలర్ ని బట్టి స్ట్రాంగ్ విలన్, ఆ రిలేటెడ్ యాక్షన్ ఎపిసోడ్స్.. అల్టిమేట్ గా చెప్పాలంటే పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్. ఈ వీకెండ్ రిలీజవుతుంది. చూడాలి… ఈ 90 ML బాక్సాఫీస్ దగ్గర ఈ మాత్రం కిక్కిస్తుందో…

భాగ్యనగర వీధుల్లో :  శ్రీనివాస రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా. సోషల్ మీడియాల్ ఈ మధ్య ట్రెండ్ అయిన ఎలిమెంట్స్… దానికి తోడు స్ట్రాంగ్ స్టోరీ లైన్… శ్రీనివాస రెడ్డి, శకలక శంకర్, సత్య, వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్స్ చాలా కాన్ఫిడెన్స్ గా చేసిన కామెడీ ప్యాకేజ్. చూడాలి. అనుకున్న స్థాయిలో నవ్వించగలిగితే ఏముంది సక్సెస్ అందుకున్నట్టే…

మిస్ మ్యాచ్ : ‘కౌసల్యా కృష్ణమూర్తి’ సినిమాతో తెలుగులో ఐశ్వర్యా రాజేష్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ సినిమా లాగే  ఈ సినిమా కూడా అదే స్థాయిలో రీచ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ సినిమాలో ఐశ్వర్య ‘బాక్సర్’ లా కనిపించనుంది. ట్రైలర్ చూస్తుంటే ఇంప్రెసివ్ గానే ఉంది. ఫ్యూచర్ ఏంటన్నది సినిమా రిలీజ్ అయితే తెలుస్తుంది.

వీటితో పాటు మరో 2 సినిమాలు ప్రెషర్ కుక్కర్, అశ్వమేథం సినిమాలు కూడా ఈ వీకెండ్ కే రిలీజవుతున్నాయి. చూడాలి ఈ 5 సినిమాల్లో ఏది స్ట్రాంగ్ గా నిలబడుతుందో…