వీకెండ్ రిలీజ్

Thursday,July 06,2017 - 04:03 by Z_CLU

ఈ వీకెండ్ ఏకంగా 6 సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం..

ఈ వీక్ మోస్ట్ ఎట్రాక్టివ్ మూవీ ‘నిన్ను కోరి’. నాని, నివేత, ఆది నటించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఎట్రాక్ట్ చేసింది. వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న నాని ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు దానయ్య ,కోన వెంకట్ నిర్మాతలు.


‘ఇంగ్లీష్ వింగ్లిష్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఈ వీకెండ్ ‘మామ్’తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. రవి ఉద్యవార్‌ దర్శకత్వంలో మ్యాడ్‌ ఫిలింస్‌, థర్డ్‌ ఐ పిక్చర్స్‌ బ్యానర్స్ పై తెరకెక్కిన ఈ సినిమాకు ఎ.ఆర్‌.రెహమాన్‌ మ్యూజిక్ అందించాడు. తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో తెరకెక్కిన మామ్ ఈ వీకెండ్ ఎట్రాక్షన్స్ లో ఒకటిగా నిలిచింది.

స్పైడర్ మ్యాన్ అంటే తెలియని సినీ ప్రేమికుడు ఉండడు. ఈ వీకెండ్ మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేయడానికి ‘స్పైడర్ మ్యాన్’ నుంచి మరో మూవీ రెడీ అయింది. స్పైడర్ మేన్ హోమ్ కమింగ్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా రేపట్నుంచి తెలుగు రాష్ట్రాల్లో సందడి చేయనుంది.


పూర్ణ మెయిన్ రోల్ లో డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై పన్నా రాయల్‌ దర్శకత్వంలో ‘కాలింగ్‌ బెల్‌’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన హార్రర్‌ ఎంటర్‌టైనర్‌ ‘రాక్షసి’. అన్ని కార్యక్రమాలు ఫినిష్ చేసుకున్న ఈ సినిమా జూలై 7న శుక్రవారం విడుదలకు రెడీ అయింది.


ఈ వీకెండ్ ఓ డబ్బింగ్ సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతుంది. విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా జగపతిబాబు విలన్ గా భరతన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘భైరవ’ అనే తమిళ సినిమాను ‘ఏజెంట్ భైరవ’గా రిలీజ్ చేస్తున్నారు.


ఈ శనివారం నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతుంది ‘రెండు రెళ్ళు ఆరు’. కొత్తవాళ్ళతో నందు మల్లెల దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం, డే డ్రీమ్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన ఈ సినిమాను రాజమౌళి ప్రమోట్ చేయడంతో ప్రేక్షకులకు దీని గురించి తెలిసింది.