వీకెండ్ రిలీజ్

Wednesday,June 28,2017 - 04:00 by Z_CLU

ప్రతీ వీకెండ్  కొన్ని సినిమాలు ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించి ఎంటర్టైన్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తుంటాయి. ఈ ఫ్రైడే కూడా  6  సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవి హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిన సినిమా ‘జయదేవ్’. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై డీసెంట్‌ డైరెక్టర్‌ జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత కె.అశోక్‌కుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందించాడు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ ఫ్రైడే థియేటర్స్ లో ఎంట్రీ ఇస్తుంది.


ఈ ఫ్రైడే నుంచి థియేటర్స్ లో తన మార్క్ కామెడీతో ఎంటర్టైన్ చేయడానికి వైరస్ లా వస్తున్నాడు సంపూర్ణేష్. ఎ.ఎస్.ఎన్ ఫిలిమ్స్ బ్యానర్ పై సంపూర్ణేష్ టైటిల్ పాత్రలో ఎస్.ఆర్.కృష్ణ దర్శకత్వంలో  తెరకెక్కిన “వైరస్” సినిమా ఈ ఫ్రైడే థియేటర్ కి రానుంది. “నో వేక్సిన్, ఓన్లీ టాక్సిన్” అనే ట్యాగ్ లైన్ తో కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సంపూర్ణేష్ సరసన  గీత్ షా కథానాయిక గా నటించగా సలీమ్.ఎం.డి-శ్రీనివాస్ వంగాల సంయుక్తంగా నిర్మించారు. మీనాక్షి భుజంగ్-సునీల్ కశ్యప్ లు సంగీతం అందించారు.


గ్యాంగ్‌స్ట‌ర్‌ న‌యీం జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఖ‌య్యూం భాయ్‌’ ఈ శుక్రవారం రిలీజ్ కి రెడీ అయింది. న‌యీమ్ పాత్ర‌లో క‌ట్టా రాంబాబు, ఏసీపీ పాత్ర‌లో తార‌క‌ర‌త్న నటించిన ఈ సినిమాకు భ‌ర‌త్ ద‌ర్శ‌కత్వం వహించాడు. శ్రీ సాయి ఊహ క్రియేష‌న్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి క‌ట్టా శార‌ద చౌద‌రి నిర్మించిన ఈ సినిమాకు శేఖ‌ర్ చంద్ర సంగీతం అందించారు.


ఇటీవ‌లే త‌మిళ్ లో విడుద‌లై సూపర్ హిట్ సాధించిన ‘వెల్లై కార‌న్’ సినిమా ‘ప్రేమ‌లీల‌-పెళ్లి గోల’ టైటిల్ తో తెలుగులో ఈ శనివారం రిలీజ్ కానుంది. మ‌హా వీర్ పిలిమ్స్ అధినేత‌ నిర్మాత పార‌స్ జైన్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. విష్ణు విశాల్, నిక్కీ గ‌ల్రానీ హీరో హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎళిల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. లేటెస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ ప‌నులు పూర్తిచేసుకుని జులై 1న రిలీజ్ కి రెడీ అవుతుంది ఈ సినిమా.


ఈ ఫ్రైడే ఈ తెలుగు సినిమాలతో పాటు ట్రాన్స్ ఫార్మర్ (ది లాస్ట్ నైట్) అనే హాలీవుడ్ సినిమా,’ఏక్ హసీనా థీ-ఏక్ దీవానా థా’ అనే బాలీవుడ్ సినిమా కూడా థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.