వీకెండ్ రిలీజెస్

Wednesday,March 20,2019 - 06:25 by Z_CLU

పరీక్షల సీజన్ కాబట్టి న్యాచురల్ గానే పెద్ద సినిమాలు ఈ వీకెండ్ ని కనీసం కన్సిడర్ కూడా చేయకపోవడంతో, ఈ గ్యాప్ ని చిన్న సినిమాలు పర్ఫెక్ట్ యుటిలైజ్ చేసుకుంటున్నాయి. ఈ వీకెండ్ వరసగా 4 సినిమాలు రిలీజవుతున్నాయి.

చీకటి గదిలో చితక్కొట్టుడుఅదిత్ అరుణ్, నిక్కీ తంబోలి జంటగా నటించిన అడల్ట్ హారర్ సినిమా ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. మార్చి 21 న రిలీజవుతుందీ సినిమా. రెస్పాన్స్ జస్ట్ ట్రైలర్ కేనా…? లేకపోతే ఆ ఇంపాక్ట్ బాక్సాఫీస్ పై కూడా కనబడుతుందా అనేది రేపు తెలిసిపోతుంది.

పులి జూదం : డైరెక్ట్ తెలుగు సినిమా కాకపోయినా ఈ వీకెండ్ రిలీజెస్ లో కొద్దో గొప్పో బజ్ ఉన్న సినిమా ఇదే. మోహన్ లాల్, విశాల్, శ్రీకాంత్ తో పాటు రాశిఖన్నా కూడా నటించిన ఈ సినిమా, యాక్షన్ థ్రిల్లర్స్ ని లవర్స్ కి నచ్చే స్కోప్ అయితే కనిపిస్తుంది. 21 మార్చి రిలీజ్ డేట్.

వినరా సోదరా వీర కుమారా : శ్రీనివాస్ సాయి, ప్రియాంక జైన్ హీరో హీరోయిన్స్ గా నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ తో పెద్దగా స్టోరీలైన్ అయితే రివీల్ కాలేదు కానీ, సినిమాలో ఇంప్రెస్ చేసే కొత్త పాయింట్ ఉంటుందని, ప్రేక్షకులు డెఫ్పినెట్ గా కనెక్ట్ అవుతారని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఈ సినిమా 22 మార్చి న రిలీజవుతుంది.

ఈ 3 సినిమాలతో పాటు మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘ప్రేమతో చెప్పనా’ మార్చి 21 న రిలీజవుతుంది.