వీకెండ్ రిలీజ్

Wednesday,February 27,2019 - 02:58 by Z_CLU

ఈ వీకెండ్ 3 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. ఇవన్నీ వేటికవే డిఫరెంట్ జానర్స్. 118 అనే సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అయితే, విశ్వాసం పూర్తిగా యాక్షన్ బేస్డ్ మూవీ. ఇక క్రేజీ క్రేజీ ఫీలింగ్ అనే చిన్న సినిమా
రొమాంటిక్ జానర్ లో వస్తోంది

కల్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ 118. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గుహన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేశ్‌ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, షాలినీ పాండే హీరోయిన్లు. శేఖర్ చంద్ర మ్యూజిక్ ఇచ్చాడు. ఈ వీకెండ్ ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఇదే.

ఇక అజిత్, నయనతార కలిసి నటించిన యాక్షన్ ఎంటర్ టైనర్ విశ్వాసం కూడా ఈ వీకెండే థియేటర్లలోకి వస్తోంది. అజిత్ కు తెలుగులో మార్కెట్ లేదు. కానీ ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి కారణాలు రెండు. ఒకటి ఈ మూవీ ఆల్రెడీ తమిళనాట పెద్ద హిట్. ఇక రెండోది నయనతార. ఈ రెండు యాంగిల్స్ లో బజ్ క్రియేట్ చేస్తోంది విశ్వాసం.

118, విశ్వాసం సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా థియేటర్లలో తన అదృష్టాన్ని చెక్ చేసుకోడానికి రెడీ అయింది. దాని పేరు క్రేజీ క్రేజీ ఫీలింగ్. టైటిల్ చూస్తేనే అర్థమౌతుంది, ఇదొక రొమాంటిక్ సినిమా అని. విశ్వంత్, పాలక్ లల్వానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించాడు.