వీకెండ్ రిలీజెస్

Wednesday,February 13,2019 - 11:10 by Z_CLU

టాలీవుడ్ లో ఈ వారం తెలుగు మూవీస్ రిలీజ్ లేకపోవడంతో వాలెంటైన్స్ స్పెషల్ గా రెండు డబ్బింగ్ సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి.

కార్తి హీరోగా యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ‘దేవ్’ సినిమా గురువారమే థియేటర్స్ లోకి వస్తోంది. కార్తి సరసన రకుల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు రజత్ రవి శంకర్ దర్శకుడు. ప్రిన్స్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు హక్కులను ప్రముఖ నిర్మాత ఠాగూర్ మధు దక్కించుకొని రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.


మలయాళంలో ‘ఒరు ఆడార్ లవ్’ అనే సినిమా తెలుగులో లవర్స్ డే అనే టైటిల్ తో రిలీజవుతోంది. కన్ను కొట్టి ప్రపంచాన్ని మాయ చేసిన విన్కింగ్ స్టార్ ప్రియా వారియర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రోహన్ హీరోగా నటించాడు. ఒమ‌ర్ లులు దర్శకత్వంలో టీనేజ్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఎ. గురురాజ్‌, సి.హెచ్‌. వినోద్‌రెడ్డి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2 వేల థియేటర్లకుపైగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తెలుగులో సుమారు 600 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.