వీకెండ్ రిలీజెస్

Thursday,December 27,2018 - 11:03 by Z_CLU

లాస్ట్  వీకెండ్ వెరీ  స్పెషల్ అనిపించుకుంది. రిలీజైన ప్రతి సినిమా డిఫెరెంట్ జోనర్స్ నుండే. దాంతో ఆడియెన్స్ కి ఏ సినిమా చూడాలా అనే తర్జన భర్జన తప్పింది. రిలీజైన ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ లోపు నెక్స్ట్ వీకెండ్ సినిమాలు కూడా తన మార్క్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. రిలీజయ్యాక ఈ సినిమాల రేంజ్ ఎలా ఉండబోతుందో తెలీదు కానీ, 2018 లో లాస్ట్ వీకెండ్ రిలీజ్ కాబోయే  సినిమాలు ఇవే.

ఇదంజగత్ : దర్శకుడు అనిల్ శ్రీకంఠం ఎంతవరకు ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేసి ఉంటాడో రిలీజ్ కి ముందే చెప్పడం కష్టం కానీ, సుమంత్ మాత్రం తన కరియర్ లోనే ఫస్ట్ టైమ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించడం. ప్రమోషన్స్ లో సుమంత్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే, సినిమా సక్సెస్ గ్యారంటీ అనే సూచనలు కనిపిస్తున్నా, సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్ ని ఏ రేంజ్ లో మెస్మరైజ్ చేస్తాయో చూడాలి. ఈ సినిమా డిసెంబర్ 28 న రిలీజవుతుంది.

బ్లఫ్ మాస్టర్ : సత్యదేవ్ ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన మాస్ ఎంటర్ టైనర్ బ్లఫ్ మాస్టర్. తమిళ బ్లాక్ బస్టర్ ‘శతురంగ వెట్టై’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్,  వచ్చేవారం బాక్సాఫీస్ లెవెల్స్  కి ఎంతవరకు మ్యాచ్ అవుతాయో చూడాలి. డిసెంబర్ 28 ఈ సినిమా రిలీజ్ డేట్. గోపీ గణేష్ ఈ సినిమాకి డైరెక్టర్.

మంచు కురిసే వేళలో : రామ్ కార్తీక్, ప్రణాళి జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ‘మంచు కురిసే వేళలో’.  బాల  బోడెపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 28 న రిలీజవుతుంది.

ఇష్టంగా : లవ్, లివింగ్ రిలేషన్ షిప్ చుట్టూ తిరిగే కథతో తెరకెక్కింది ఇష్టంగా. సోషల్ మీడియాలో ఈ సినిమా ట్రైలర్ కి రెస్పాన్స్ కూడా బాగానే ఉంది.  సంపత్ V. రుద్ర ఈ సినిమాకి డైరెక్టర్. డిసెంబర్ 28 న రిలీజవుతుంది ఇష్టంగా.

U:  ఈ సినిమాకి కొవెర దర్శకుడు. సినిమాలో హీరోగా కూడా తనే నటించడం విశేషం. హిమాన్షి, స్వప్నారావ్  హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్. ఒక విలేజ్ లో మొదలై అండర్ వరల్డ్ లో ఎండ్ అయ్యే స్టోరీలైన్ తో తెరకెక్కిన ఈ సినిమా, ఆడియెన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.