వీకెండ్ రిలీజ్

Wednesday,December 19,2018 - 02:32 by Z_CLU

వరసగా 5 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి ఈ వీకెండ్. జోనర్ ఆంగిల్ లో ఆలోచిస్తే  దేనికదే వెరీ స్పెషల్. ఈ 5 సినిమాలలో 2 తెలుగు స్ట్రేట్ సినిమాలు. ఈ వీకెండ్ క్రిస్మస్ బరిలోకి దిగనున్న సినిమాల వివరాలు…

పడి పడి లేచే మనసు : శర్వానంద్, సాయి పల్లవి జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఆల్మోస్ట్ యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ కూడా రావడంతో ఈ సినిమాపై మరింత బజ్ పెరిగింది. భారీ అంచనాల మధ్య రిలీజవుతున్న ‘పడి పడి లేచే మనసు’ ఆడియెన్స్ అంచనాలను ఏ రేంజ్ లో అందుకుంటుందనేది ఈ నెల 21 న తెలిసిపోతుంది.

అంతరిక్షం : ‘ఘాజి’ సినిమాతో డిఫెరెంట్ ఫిల్మ్ మేకర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కింది అంతరిక్షం 9000 KMPH. స్టోరీలైన్ పై సస్పెన్స్ మెయిన్ టైన్ చేస్తూనే, భారీ స్థాయిలో సినిమాని ప్రమోట్ చేస్తున్న మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నెల 21 న రిలీజవుతున్న ఈ స్పేస్ ఎంటర్ టైనర్ ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.

K.G.F: 1970 బ్యాక్ డ్రాప్ లో అప్పటి గోల్డ్ మైన్  మాఫియా  బ్యాక్    డ్రాప్ లో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ K.G.F. కన్నడ హీరో యష్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన ఈ సినిమా ఇప్పటికే వైడ్ రేంజ్ లో రీచ్ అయింది. ఫిల్మ్ మేకర్స్ ట్రైలర్ లో ప్రెజెంట్ చేసిన విజువల్స్, సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేసింది. మరి ఈ అంచనాలను K.G.F.  ఎంతవరకు  అందుకుందనేది చూడాలి. డిసెంబర్ 21 న రిలీజవుతుంది ఈ సినిమా.  ఈ సినిమాకి ప్రశాంత్ నీల్ డైరెక్టర్.

మారి 2 : ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన ‘మారి 2’  ఈ వీకెండ్ తమిళ, తెలుగు  భాషల్లో  ఒకేసారి రిలీజవుతుంది. బాలాజీ మోహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా, టాలీవుడ్ లో కూడా ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది. మరి ‘మారి 2’  ఈ క్రిస్మస్ బరిలో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో నిలబడుతుందో చూడాలి. ఈ సినిమాకి బాలాజీ మోహన్ డైరెక్టర్.

 

జీరో : బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘జీరో’ కూడా డిసెంబర్ 21 న రిలీజవుతుంది. షారుక్ ఖాన్ మరుగుజ్జులా మోస్ట్ కాన్ఫిడెంట్ యంగ్ స్టర్ లా నటిస్తున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్ గా అంచనాలున్నాయి. కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఈ సినిమాలో హీరోయిన్స్. ఆనంద్ L. రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి గౌరీ ఖాన్ ప్రొడ్యూసర్.