వీకెండ్ రిలీజ్

Wednesday,April 12,2017 - 02:06 by Z_CLU

హారర్, ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ తో పాటు మరో మోస్ట్ వాంటెడ్ హాలీవుడ్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిపోయింది ఈ వీకెండ్. త్రీ డిఫెరెంట్ జోనర్స్ తో గెట్ రెడీ మోడ్ లో ఉన్న ఈ వీకెండ్ ఎంటర్ టైన్ చేయనున్న సినిమాలివే.

 రాఘవ లారెన్స్, రితిక సింగ్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ శివలింగ. P. వాసు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే మాస్ ఆడియెన్స్ లో కావాల్సినంత క్యూరాసిటీ క్రియేట్ చేసింది. గతంలోనూ ఇలాంటి హారర్ కంటెంట్ తో ఎంటర్ టైన్ చేసిన రాఘవ, మరోసారి అదే రేంజ్ బ్లాక్ బస్టర్ ని బ్యాగ్ లో వేసుకోవడానికి ఈ ఫ్రై డే థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడు. ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. R. రవీంద్రన్ ఈ సినిమాని నిర్మించాడు.

 వరుణ్ తేజ్ హీరోగా లావణ్య త్రిపాఠి, హేబా పటేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన ఫీల్ గుడ్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ మిస్టర్. శ్రీను వైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి ఇప్పటికే యూత్ నుండి బోలెడంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మిక్కీ జె. మేయర్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమా ఈ ఫ్రై డే గ్రాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది.

F. గ్యారీ గ్రే డైరెక్షన్ లో విన్ డీసిల్, మిషెల్ రాడ్ రిగ్జ్ జంటగా నటించిన అల్టిమేట్ స్పీడ్ ఎంటర్ టైనర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8. ఈ సినిమా గురువారం నుండి థియేటర్స్ లో సందడి చేయనుంది.