వీకెండ్ రిలీజెస్

Tuesday,September 25,2018 - 11:19 by Z_CLU

ఈ వీకెండ్ కేవలం 2 సినిమాలు మాత్రమే థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఒకే ఒక్కటి స్ట్రయిట్ మూవీ. మరొకటి డబ్బింగ్ మూవీ. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఒకే ఒక్క స్ట్రయిట్ మూవీ దేవదాస్. నాగార్జున, నాని హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా రేసులో ఉంది కాబట్టే, చాలా సినిమాలు వీకెండ్ థియేటర్లలోకి రావట్లేదు. అంతలా అంచనాల్ని పెంచేసింది ఈ సినిమా. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రష్మిక, ఆకాంక్ష హీరోయిన్లుగా నటించారు.

ఇక దేవదాస్ తో పాటు థియేటర్లలోకి వస్తోంది నవాబ్ అనే సినిమా. మణిరత్నం డైరక్ట్ చేసిన మూవీ ఇది. ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా మల్టీస్టారర్ సినిమానే. అరవింద్ స్వామి, శింబు, విజయ్ సేతుపతి, అరుణ్ విజయ్ లాంటి నటులు ఇందులో నటించారు. ఫ్యామిలీ డ్రామా కమ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దాడు మణిరత్నం. రెహ్మాన్ మ్యూజిక్ ఈ సినిమా స్పెషల్ ఎట్రాక్షన్.