వీకెండ్ రిలీజ్

Wednesday,September 19,2018 - 04:48 by Z_CLU

సామి

ఈ ఫ్రైడే చియాన్ విక్రం ఓ డబ్బింగ్ సినిమాతో థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు… విక్రమ్, దర్శకుడు హరి కాంబినేషన్లో 15 సంవత్సరాల క్రితం వచ్చిన ‘సామి’ తమిళ నాడులో ఎంతటి గ్రాండ్ హిట్ సాదించిందో తెలిసిందే.. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రెడి చేసారు… మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో ‘సామి’ అనే టైటిల్ తో ఈ శుక్రవారమే గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. విక్రం సరసన కీర్తీ సురేష్ నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ ప్రై. లిమిటెడ్ బ్యానర్‌లలో బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు.


నన్ను దోచుకుందువటే

ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది ‘నన్ను దోచుకుందువటే’.. సుదీర్ బాబు నిర్మాతగా మారి సుదీర్ బాబు ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కించిన ఈ సినిమాతో రాజశేఖర్ నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుదీర్ బాబు సరసన నభ నటేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అజనీష్ లోక్ నాద్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. టీజర్, ట్రైలర్ తో ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ శుక్రవారం నుండి థియేటర్స్ లో సందడి చేయనుంది.


కురుక్షేత్రం

అర్జున్ 150 వ సినిమాగా తెరకెక్కిన ‘కురుక్షేత్రం’ కూడా ఈ ఫ్రైడే ప్రేక్షకుల ముందుకు రానుంది. అరుణ్‌ వైద్యనాథన్‌ డైరెక్షన్ లో క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను ప్యాషన్‌ స్టూడియోస్‌ సమర్పణలో శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌ మీద శ్రీనివాస్‌ మీసాల తెలుగులో విడుదల చేస్తున్నారు. సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.


‘ఈ మాయ పేరేమిటో’

ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు రాహుల్ విజయ్ హీరోగా పరిచయం అవుతున్న ‘ఈ మాయ పేరేమిటో’ సినిమా కూడా ఈ శుక్రవారమే థియేటర్స్ లోకి వస్తుంది. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో రాము కొప్పుల అనే దర్శకుడు టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. చిన్న సినిమా అయినప్పటికీ స్టార్స్ ఈ సినిమాను స్పెషల్ గా ప్రోమోట్ చేస్తుండడంతో ఈ సినిమాపై టాలీవుడ్ లో పాజిటీవ్ బజ్ నెలకొంది.

అంతర్వేదమ్

ఈ వారం ఈ నాలుగు సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా విడుదలవుతుంది… ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై క్రౌడ్ ఫండ్ తో నిర్మించిన ‘అంతర్వేదమ్’ ఈ శుక్రవారం రిలీజ్ అవుతుంది. కొత్త వారితో రూపొందిన ఈ సినిమాకు చందిన రవికిషోర్ దర్శకుడు.