వీకెండ్ రిలీజెస్

Wednesday,August 08,2018 - 01:18 by Z_CLU

ఈ వీకెండ్ 2 సినిమాలు రిలీజవుతున్నాయి.అగ్రెసివ్ ప్రమోషన్స్ ఫ్యాన్స్ లో మ్యాగ్జిమం ఇంపాక్ట్ చూపించిన ఈ 2 సినిమాలు డిఫెరెంట్ జోనర్స్ లో తెరకెక్కినవే. వాటి వివరాలు.

శ్రీనివాస కళ్యాణం :  ఆగష్టు 9 న రిలీజవుతుంది ‘శ్రీనివాస కళ్యాణం’. ‘శతమానం భవతి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరవాత సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో తెరకెక్కిన ట్రెడిషనల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘శ్రీనివాస కళ్యాణం’. నితిన్, రాశిఖన్నా జంటగా నటించిన ఈ సినిమా, రిలీజ్ కి ముందే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తుంది. పెళ్ళి గొప్పతనం ఎలివేట్ చేస్తూ తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేస్తుందో చూడాలి.

విశ్వరూపం 2 : ఈ నెల 10 న రిలీజవుతుంది కమలహాసన్ విశ్వరూపం 2. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కమల్ హాసన్ దర్శకత్వం వహించాడు. టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా సక్సెస్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిలిం మేకర్స్. ఈ సినిమాలో కమల్ హసన్ సరసన పూజా కుమార్ నటించింది.