Weekend Release - ఈవారం సినిమాలు

Wednesday,August 18,2021 - 12:16 by Z_CLU

ఎప్పట్లానే ఈ వారం కూడా 6 సినిమాలు బాక్సాఫీస్ బరిలో నిలిచాయి. అయితే వీటిలో అంచనాలతో వస్తున్న సినిమా ఒకే ఒక్కటి. ఆ ఒక్క సినిమాతో పాటు మిగతా సినిమాల సంగతులేంటో చూసేద్దాం

ఈ వారం అంచనాలతో వస్తున్న ఒకే ఒక్క సినిమా రాజరాజ చోర. శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు కింగ్ సైజ్ ఎంటర్ టైన్ మెంట్ అందించడానికి సిద్ధమైంది. హసిత్ గోలి దర్శకుడిగా పరిచయమౌతున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై వస్తోంది. మేఘా ఆకాష్, సునైన హీరోయిన్లు.

ఇక రాజరాజ చోర సినిమాతో పాటు ఈ గురువారం క్రేజీ అంకుల్స్, కనబడుటలేదు అనే మరో 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. మనో, రాజారవీంద్ర, భరణి హీరోలుగా నటించిన క్రేజీ అంకుల్స్ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా నటించింది. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించారు. ఇక సుక్రాంత్ హీరోగా నటించిన సినిమా కనబడుట లేదు. ఇన్వెస్టిగేషన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

శుక్రవారం, అంటే 20వ తేదీన మరో 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో చేరువైన దూరమైన, అవలంబిక, బజార్ రౌడీ సినిమాలున్నాయి. సుజీత్, తరుణిక జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ చేరువైనా-దూరమైనా. సుజయ్, అర్జన, మంజూష, కృతిక నటించిన సినిమా అవలంబిక. సంపూర్ణేష్ బాబు నటించిన కామెడీ ఎంటర్ టైనర్ బజార్ రౌడీ. ఈ 3 సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics