Weekend Release - ఈ వారం ఏకంగా 9 సినిమాలు

Thursday,August 12,2021 - 03:19 by Z_CLU

ఓవైపు థియేటర్లు తెరుచుకున్నాయి. మరోవైపు ఆక్యుపెన్సీ రోజురోజుకు పెరుగుతోంది. దీంతో మేకర్స్ లో నమ్మకం కుదిరింది. తమ సినిమాల్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ వారం ఏకంగా 9 స సినిమాలు క్యూ కట్టాయి. ఇవన్నీ చిన్న సినిమాలే అయినప్పటికీ, వేటికవే భిన్నమైనవి.

ఈ శుక్రవారం ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కాస్త అంచనాలతో వస్తున్న సినిమా సుందరి. పూర్ణ లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాపై ఓ మోస్తరు బజ్ నడుస్తోంది. రిజ్వాన్ ఎంట‌ర్టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ హీరోయిన్ సెంట్రిక్ ఫిలింకు సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు. నాట‌కం ఫేమ్ క‌ళ్యాణ్ జీ గోగ‌న డైరెక్ష‌న్‏లో ఈ మూవీ తెరకెక్కింది. ఇప్ప‌టికే విడుదలైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

సుందరితో పాటు మరికొన్ని చిత్రాలు కూడా రేపు థియేటర్లలోకి రాబోతున్నాయి. బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, చైతన్యం, రావే నా చెలియా, ది కంజూరింగ్ 3, ఒరేయ్ బామ్మర్ది అనే సినిమాలు వస్తున్నాయి. వీటితో చెప్పుకోదగ్గ సినిమా ఒరేయ్ బామ్మర్ది. సిద్దార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ హీరోలుగా నటించిన ఓ తమిళ సినిమాను తెలుగులో ఇలా డబ్బింగ్ చేశారు.

ఇక ఈ వీకెండ్ అంచనాలతో వస్తున్న ఒకే ఒక్క సినిమా పాగల్. 14వ తేదీన ఈ మూవీ రిలీజ్ అవుతుంది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన ఈ సినిమాలో నివేత పెతురాజ్, సిమ్రాన్ చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఇప్పటికే రిలీజైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో మూవీకి బజ్ వచ్చింది. దీనికితోడు సినిమా హిట్టవ్వకపోతే తన పేరు మార్చుకుంటానంటూ విశ్వక్ సేన్ స్టేట్ మెంట్ ఇవ్వడం, అందర్నీ ఈ మూవీ వైపు ఆకర్షించింది.

విశ్వక్ నటించిన పాగల్ సినిమాతో పాటు రైతన్న అనే మరో సినిమా కూడా శనివారమే థియేటర్లలోకి వస్తోంది. అన్నీ తానై ఆర్.నారాయణమూర్తి ఈ సినిమాను తెరకెక్కించాడు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics