Weekend Release - ఈవారం 7 సినిమాలు

Thursday,September 16,2021 - 03:50 by Z_CLU

ఎప్పట్లానే ఈవారం కూడా అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మొత్తం 7 సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. వీటిలో 6 థియేటర్లలోకి వస్తుండగా.. ఒక సినిమా మాత్రం నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఆ మూవీ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

maestro movie nithin nabha tamanna 1

ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న మూవీ మాస్ట్రో. హిందీలో సూపర్ హిట్టయిన అంధాధూన్ కు రీమేక్ గా వస్తోంది. మేర్లపాక గాంధీ డైరక్ట్ చేసిన ఈ సినిమాలో నితిన్-నభా నటేష్ హీరోహీరోయిన్లుగా నటించగా.. తొలిసారి తమన్న, నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతోంది. టీజర్/ట్రయిలర్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అయితే ఇది థియేటర్లలోకి రావడం లేదు. నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతోంది.

ఇక థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో కాస్త అంచనాలు పెంచుతున్న సినిమా గల్లీ రౌడీ. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. కోన వెంకట్ ప్రజెంటర్ గా వ్యవహరించడమే కాకుండా, స్క్రీన్ ప్లే కూడా అందించాడు. నేహా షెట్టి హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వులు పంచుతుందని గట్టిగా చెబుతోంది యూనిట్.

  • plan b movie

శ్రీనివాసరెడ్డి లీడ్ రోల్ పోషించిన సినిమా ప్లాన్-బి. ట్రయిలర్ తో ఎట్రాక్ట్ చేస్తోంది ఈ మూవీ. శ్రీనివాస్ రెడ్డితో పాటు.. సూర్య వశిష్ట, మురళి శర్మ, రవిప్రకాష్, డింపుల్, రాజేంద్ర, బ్లాక్ స్టార్ శాని మరియు నవీనారెడ్డి ముఖ్య తారాగణం తో ఎవిఆర్ మూవీ వండర్స్ పతాకం పై కెవి రాజమహి దర్శకత్వంలో ఎవిఆర్ నిర్మిస్తోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “ప్లాన్-బి”.

Vijay Antony Vijaya Raghavan Movie first look 2

ఈ సినిమాలతో పాటు విజయ్ ఆంటోనీ నటించిన విజయ రాఘవన్, జెమ్, హనీ ట్రాప్, మరో ప్రస్థానం సినిమాలు కూడా రేపు థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ 7 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics