Weekend Release - ఈ వారం సినిమాలు

Thursday,August 05,2021 - 01:07 by Z_CLU

చిన్న సినిమాలతో బాక్సాఫీస్ లో సందడి మొదలైంది. గత వారం 5 సినిమాలు థియేటర్లలోకి రాగా, ఈ వీకెండ్ ఏకంగా 6 సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి. అవేంటో చకచకా చూసేద్దాం

SR కల్యాణమండపం
ఈ వారం మంచి బజ్ తో వస్తున్న సినిమా SR కల్యాణమండపం. కిరణ్ అబ్బవరం, ప్రియాంక జవాల్కర్
హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాతో శ్రీధర్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఇప్పటికే ట్రయిలర్ పెద్ద  హిట్టవ్వడంతో పాటు.. చేతన్ భరధ్వాజ్ కంపోజ్ చేసిన పాటలన్నీ క్లిక్ అవ్వడం సినిమాకు పెద్ద పాయింట్. సినిమాలో సాయికుమార్, కిరణ్ తండ్రికొడుకులుగా నటించారు. దాదాపు 600 థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది.

ఇప్పుడుకాక ఇంకెప్పుడు
హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇప్పుడుకాక ఇంకెప్పుడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా, మంచి కామెడీ, ఇంకాస్త సందేశంతో వస్తున్న ఈ సినిమాపై యూత్ లో మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీనే ఈ సినిమా. యుగంధర్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

ముగ్గురు మొనగాళ్లు
పేరు చూసి ఇది యాక్షన్ సినిమా అనుకోవద్దు. పక్కా కామెడీ మూవీ. శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు హీరోలుగా నటించారు. వీళ్లలో ఒకరికి కనపడదు, మరొకరికి వినపడదు, ఇంకొకరు మాట్లాడలేరు. ఇలాంటి 3 విచిత్రమైన పాత్రలు కలిసి నవ్వించిన ఈ సినిమానే ఈ ముగ్గురు మొనగాళ్లు. అభిలాష్‌ రెడ్డి
దర్శకత్వంలో చిత్ర మందిర్ స్టూడియోస్ పతాకంపై అచ్యుతరామారావు ఈ సినిమా నిర్మించారు.

ఈ సినిమాలతో పాటు మ్యాడ్, మెరిసే మెరిసే, క్షీరసాగర మథనం అనే మరో సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈ 6 సినిమాల్లో ఏది క్లిక్ అవుతుందో చూడాలి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics