Weekend Release - ఈ శుక్రవారం 5 సినిమాలు

Wednesday,July 28,2021 - 02:34 by Z_CLU

సెకెండ్ వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఇండస్ట్రీ గాడిన పడలేదు. సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జులై 30) నుంచి టాలీవుడ్ లో సందడి స్టార్ట్ అయింది. సినిమా రిలీజ్ లు షురూ అయ్యాయి. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ ఫ్రైడే 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

సత్యదేవ్ హీరోగా నటించిన తిమ్మరుసు సినిమా ఈ వీకెండ్ థియేటర్లలోకొస్తోంది. లాయర్ పాత్రలో సత్యదేవ్ ఇందులో కనిపిస్తున్నాడు. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. సినిమాపై ఆల్రెడీ అంచనాలున్నప్పటికీ.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రయిలర్ రిలీజ్ చేయడంతో హైప్ భారీగా పెరిగింది.

తిమ్మరుసుకు అంతో ఇంతో పోటీగా నిలుస్తుందని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తున్న సినిమా ఇష్క్. తేజ సజ్జ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ ఆకట్టుకుంది. ప్రమోషన్ కూడా భారీగా చేస్తున్నారు. మలయాళ హిట్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ థ్రిల్లర్ మూవీ కచ్చితంగా తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెన్స్ తో ఉంది యూనిట్.

ఇక ఈ వారం థియేటర్లలోకొస్తున్న మరో సినిమా నరసింహపురం. పేరుకు ఇది చిన్న సినిమానే అయినప్పటికీ..
ప్రకాష్ రాజ్ నుంచి దిల్ రాజు వరకు ఎఁతోమంది ప్రముఖులు ఈ సినిమాను మెచ్చుకోవడంతో, అందరి దృష్టిలో పడింది. కంప్లీట్ యాక్షన్ మూవీగా వస్తున్న నరసింహపురంతో నందకిషోర్ హీరోగా పరిచయమౌతున్నాడు.

ఈ సినిమాలతో పాటు పరిగెత్తు-పరిగెత్తు, త్రయం అనే మరో రెండు సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. మారిన పరిస్థితుల నేపథ్యంలో.. ఈ సినిమాలన్నీ నైజాంలో పూర్తిస్థాయిలో.. ఏపీ-సీడెడ్ లో పాక్షికంగా రిలీజ్ అవుతున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics