Weekend Release – Pushpaka Vimanam, Raja Vikramarka in race !
దీపావళి కానుకగా వచ్చిన ఎనిమి, మంచి రోజులు వచ్చాయి, పెద్దన్న సినిమాలు థియేటర్లలో నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి పోటీగా ఈ వీకెండ్ మరో 6 సినిమాలొస్తున్నాయి. వీటిలో ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమాలు మాత్రం రెండే. ఆ డీటెయిల్స్ చెక్ చేద్దాం.

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న మూవీ ‘రాజా విక్రమార్క’. కార్తికేయ, తాన్యా రవిచంద్రన్ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ఇది. శ్రీ సరిపల్లి డైరక్ట్ చేసిన ఈ మూవీలో తనికెళ్ల భరణి, సాయికుమార్, సుధాకర్ కోమాకుల ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్ కూడా గట్టిగా చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల దృష్టిలో పడింది ఈ సినిమా.

‘రాజావిక్రమార్క’కు పోటీగా వస్తున్న సినిమా ‘పుష్పక విమానం’. ఆనంద్ దేవరకొండకు ఇది మూడో సినిమా. ఇంతకుముందు ‘దొరసాని’, ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమాలు చేశాడు. ‘పుష్పకవిమానం’ సినిమాలో భార్య లేచిపోయిన భర్త పాత్రలో కనిపించబోతున్నాడు ఆనంద్ దేవరకొండ. సునీల్ ఇందులో పోలీసాఫీసర్ గా నటించాడు. మూవీలో ఎంత ఫన్ ఉంటుందో, అంతే ఎమోషన్ ఉంటుందంటున్నాడు దేవరకొండ.

ఈ వారం డబ్బింగ్ మూవీగా వస్తోంది కురుప్. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరోగా నటించడం, ట్రయిలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై కూడా పడింది. దుల్కర్ కు మంచి సినిమాలు, మంచి పాత్రలు ఎంచుకుంటాడనే పేరుంది. ఆ పేరుకు తగ్గట్టే కురుప్ ఉంటుందంటున్నాడు దుల్కర్. ట్రయిలర్ లో చూపించింది కేవలం ఒక శాతం మాత్రమేనని, యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా చూస్తే, అద్భుతమైన అనుభూతికి లోనవుతారని అంటున్నాడు.
ఈ సినిమాలతో పాటు మరో 3 చిన్న సినిమాలు కూడా ఈ శుక్రవారం థియేటర్లలోకి వస్తున్నాయి. ‘తెలంగాణ దేవుడు’, ‘ది ట్రిప్’, ‘కపటనాటక సూత్రధారి’ అనే సినిమాలు రిలీజ్ కు రెడీ అయ్యాయి.
– Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics