Weekend Release - ఈ వారం సినిమాలు

Wednesday,December 16,2020 - 03:18 by Z_CLU

తెలుగు రాష్ట్రాల్లో మెల్లమెల్లగా సినిమా సందడి ఊపందుకుంటోంది. ముందుగా మల్టీప్లెక్సులు ఓపెన్ అవ్వగా.. తాజాగా సింగిల్ స్క్రీన్స్ కూడా ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయి. ఈ క్రమంలో చిన్న సినిమాలు కొన్ని థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.

ఈ వీకెండ్ 3 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ఆ సినిమా పేర్లు మన్మధరెడ్డి, ఐందవి, కళాపోషకులు.

sampoornesh_babu-Manmadha_reddy-movie-zeecinemalu

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన సినిమా మన్మధరెడ్డి. టైటిల్ కు తగ్గట్టే రొమాంటిక్ జానర్ లో తెరకెక్కింది ఈ సినిమా. ఇక నందు-అనురాధ హీరోహీరోయిన్లుగా ఐందవి సినిమా తెరకెక్కింది. లవ్, హారర్ జానర్స్ టచ్ చేశారు ఈ సినిమాలో.

INDHAVI_movie_Nandu_avanthika

ఈ మూవీస్ తో పాటు కళాపోషకులు అనే మరో సినిమా కూడా థియేటర్లలోకి వస్తోంది. విశ్వ కార్తికేయ, దీప ఉమావతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తోంది.

సో.. ఇక నుంచి ప్రతి శుక్రవారం కొన్ని సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. క్రిస్మస్ నుంచి ఈ సినిమా సందడి మరింత ఊపందుకోనుంది.