వీకెండ్ రిలీజెస్

Wednesday,June 26,2019 - 02:01 by Z_CLU

ఈ వీకెండ్ ముచ్చటగా మూడు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో ఏ ఒక్క సినిమాను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ప్రతి సినిమాది ఓ డిఫరెంట్ జానర్. ఆ మూడు సినిమాల డీటెయిల్స్ ఓసారి చెక్ చేద్దాం

కల్కి
గరుడవేగ లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రాజశేఖర్ చేసిన సినిమా ఇది. సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే విడుదలైన కమర్షియల్ టీజర్, హానెస్ట్ ట్రయిలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది కల్కి. అదా శర్మ, నందిత శ్వేత హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకుడు.

బ్రోచేవారెవరురా
ప్రేక్షకుల్లో ఓ రేంజ్ లో అంచనాలు పెంచిన సినిమా ఇది. టైటిల్ నుంచే హైప్ క్రియేట్ చేసి, పోస్టర్ల తో అంచనాలు పెంచి, ట్రయిలర్ తో ఆ అంచనాల్ని డబుల్ చేసింది ఈ సినిమా. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి, సత్యదేవ్ నటించిన ఈ సినిమాలో నివేత థామస్, నివేత పెతురాజ్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో పాటలు ఇప్పటికే పెద్ద హిట్.

బుర్రకథ
కల్కి, బ్రోచేవారెవరురా సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా వస్తోంది బుర్రకథ. ఇంకా చెప్పాలంటే ఈమధ్య కాలంలో ఆది సినిమాలకు ఇంత హైప్ వచ్చిన సందర్భాలు లేవు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఒకెత్తయితే, ఆ కాన్సెప్ట్ ను హిలేరియస్ గా చెప్పడం మరో ఎత్తు. ఈ రెండు ఎలిమెంట్స్ బుర్రకథను హాట్ కేక్ లా మార్చేశాడు.

ఈ వీకెండ్ థియేటర్లలోకి వస్తున్న ఈ 3 సినిమాలు 3 జానర్లకు చెందినవి. కల్కి మర్డర్ మిస్టరీ అయితే, బుర్రకథ అనేది హిలేరియస్ ఎంటర్ టైనర్, ఇక బ్రోచేవారెవరురా సినిమాకు సంబంధించి జానర్ కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు మేకర్స్. అలాంటి డిఫరెంట్ సినిమా ఇది.