వీకెండ్ రిలీజ్

Wednesday,April 24,2019 - 05:59 by Z_CLU

ఒకటి కాదు, రెండు కాదు.. ఈ వీకెండ్ ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇందులో చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా లేదు. నాలుగు స్ట్రయిట్ సినిమాలు, మరో 3 డబ్బింగ్ సినిమాలు. వీటిలో కాస్తోకూస్తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీ ఎవెంజర్స్-ఎండ్ గేమ్ మాత్రమే.

వరల్డ్ వైడ్ సూపర్ హిట్ అయిన ఎవెంజర్స్ సిరీస్ లో ఆఖరి చిత్రం ఇది. అందుకే ఈ మూవీపై భారీ అంచనాలు. ఇండియాలో కూడా ఈ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తగ్గట్టే భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 2డీ, 3డీ వెర్షన్లలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ముంబయి, కోల్ కతా, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో ఈ సినిమాకు 2 రోజుల వరకు టిక్కెట్లు అమ్ముడుపోయాయి.

 

ఈ మూవీతో పాటు 90ఎంఎల్, గీతాఛలో అనే మరో రెండు డబ్బింగ్ సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. తమిళ్ లో 90ఎంఎల్ పేరుతో వచ్చిన సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఈ సినిమా ట్రయిలర్ ఇప్పటికే పాపులర్ అయింది. ఇక గీతాఛలో సినిమాలో రష్మిక హీరోయిన్. ఇదొక కన్నడ సినిమాకు డబ్బింగ్. తెలుగులో ఆమె నటించిన గీతగోవిందం, ఛలో సినిమాలు హిట్ అవ్వడంతో.. కన్నడ సినిమాకు ఇలా గీతాఛలో అనే పేరుపెట్టి రిలీజ్ చేస్తున్నారు.

 

ఇక స్ట్రయిట్ మూవీస్ విషయానికొస్తే.. దిక్సూచి, దుప్పట్లో మిన్నాగు, MBM, డేంజర్ లవ్ స్టోరీ అనే 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దిక్సూచి సినిమాను డివోషనల్ క్రైమ్ థ్రిల్లర్ గా చెబుతున్నారు. రెగ్యులర్ గా వచ్చే క్రైమ్ సినిమాలకు డివోషనల్ యాంగిల్ జోడించడం ఈ సినిమా ప్రత్యేకత.

ఇక దుప్పట్లో మిన్నాగు అనే సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ ఈ సినిమాను డైరక్ట్ చేశారు. ఆయన గతంలో రచించిన దిండు కింద నల్లత్రాచు అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇక MBM-మేరా భారత్ మహాన్, డేంజర్ లవ్ స్టోరీ అనే మరో 2 సినిమాలు కూడా ఈ వీకెండ్ వస్తున్నాయి.