Ready for Release - ఈ వీకెండ్ సినిమాలు

Thursday,February 25,2021 - 11:51 by Z_CLU

మరోసారి ఫిబ్రవరి సెంటిమెంట్ నమ్ముకున్నాడు నితిన్. గతేడాది ఫిబ్రవరికి భీష్మతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ హీరో, ఈ వీకెండ్ చెక్ తో మనముందుకొస్తున్నాడు. ఈ మూవీతో పాటు మరో 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. అవేంటో చెక్ చేద్దాం

నితిన్, చంద్రశేఖర్ యేలేటి కాంబోలో వస్తున్న సినిమా చెక్. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. సినిమా ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రకుల్, ప్రియా ప్రకాష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కల్యాణి మాలిక్ సంగీతం అందించాడు.

చెక్ తో పాటు థియేటర్లలోకి వస్తోంది అక్షర. కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పై తీసిన సీరియస్ మూవీ ఇది. చిన్నికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ పాత్రను నందిత శ్వేత పోషించింది. ఇతర కీలక పాత్రల్లో సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీతేజ, అజయ్ ఘోష్ కనిపించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.

ఈ వారం థియేటర్లలోకి వస్తున్న థ్రిల్లర్ మూవీ క్షణక్షణం. డార్క్ కామెడీ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఉదయ్ శంకర్, జియాశర్మ హీరోహీరోయిన్లు. మ్యూజిక్ డైరక్టర్లు కోటి, రఘు కుంచె ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. మేడికొండ కార్తీక్ తెరకెక్కించిన ఈ సినిమాను డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి కలిసి నిర్మించారు. ట్రయిలర్ ఇప్పటికే హిట్టయింది.

 

ఈ సినిమాలతో పాటు బాలమిత్ర, ఏప్రిల్ 28 ఏం జరిగింది అనే మరో 2 సినిమాలు కూడా ఈ వారం థియేటర్లలోకి వస్తున్నాయి. ఆల్రెడీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఉప్పెన, నాంది సినిమాలకు వీటిలో ఏ సినిమా పోటీనిస్తుందో చూడాలి.